ఆదివాసీలను ఆఫ్ నాలెడ్జ్ అని కించపరిచిన ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ తీరు తీవ్రంగా ఖండిస్తున్నాం*

by vvwnews.com

*ఆదివాసీలను ఆఫ్ నాలెడ్జ్ అని కించపరిచిన ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ తీరు తీవ్రంగా ఖండిస్తున్నాం*

*గిరిజన జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తుమ్మి అప్పలరాజు దొర*

26.3.2026.న ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ ని కలిసి బెంతు ఒరియాలను ఎస్టీల జాబితాలో చేర్చ వద్దని ఎమ్మెల్యే కి నినతి పత్రం ఇచ్చిన ఆదివాసి నాయకులను తీవ్రంగా అవమానించిన ఎమ్మెల్యే పై అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకొవాలి. అలాగే రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవాలి.
అసలు సమస్య ఏంటంటే 27 వేల మంది బెంతు ఒరియాలకి st సర్టిఫికెట్ ఇవ్వాలని వినతిపత్రాలు ఇస్తున్న.అశోక్ గారిని కలవడానికి వెళ్లిన గిరిజనలను అవమానించి మాటలు తూలిన ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలి.

బెంతు ఒరియాల విషయంలో వినతిపత్రం ఇచ్చిన ఎమ్మెల్యే
ఎస్టీల సమస్యల పై ఎందుకు నోరు మెదపరని అడుగుతున్న ఆదివాసీలపై వ్యాఖ్యలతో విరుచుకు పడ్డ ఎమ్మెల్యే. అశోక్ ఆదివాసులకు ఆఫ్ నాలర్జీ పీపుల్.. బాస్టర్డ్ అని తిట్టడం మా మనసులను తీవ్రంగా కలిచివేసింది.. ఒక జాతిని అసభ్య పదజాలంతో ఎలా నిందించరో తెలియచేయాలి.
ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని తీవ్రంగా ఖండిస్తున్నాము.

తుమ్మి అప్పలరాజు దొర
ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్. విజయనగరం జిల్లా చైర్మన్
8500044423

Use Social Media to Spread the Word about Our News

related articles