ఎం.ఎస్.ఎఫ్.ఎస్ పోటీల ఛాంపియన్ గాజువాక ఎస్. ఎఫ్ ఎస్. స్కూల్
రన్నరప్ గా సీతమ్మధార ఎస్ ఎఫ్ ఎస్ స్కూల్
ముగిసిన ద్విరాష్ట క్రీడా, సాంస్కృతిక పోటీలు
— గత మూడు రోజులుగా సీతమ్మధార ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ప్రాంగణంలో జరుగుతున్న 11వ ఎంఎస్ఎఫ్ఎస్ ద్వి రాష్ట్ర క్రీడా సాంస్కృతిక పోటీలు సోమవారం సాయంత్రం ఘనంగా ముగిశాయి ఈ పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్ షిప్ను గాజువాక ఎస్ఎఫ్ఎస్ స్కూల్ గెలుచుకోగా, రన్నరప్ ట్రోఫీ ని సీతమ్మధార స్కూలు కైవసం చేసుకుంది.పోటీల ప్రధాన నిర్వాహకులు రెవరెండ్ ఫాదర్ మనోజ్ అధ్యక్షతన జరిగిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఎస్ స్కూల్స్ జనరల్ మేనేజర్ రెవరెండ్ ఫాదర్ బి. సురేష్ బాబు ఫార్మేషన్ విభాగ జనరల్ మేనేజర్ (గోవా) రెవరెండ్ ఫాదర్ బెనడైట్ డిసోజాలు ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్బంగా పోటీల నిర్వాహకులు మనోజ్ మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన ఈ మీట్ నిర్వహించడం గర్వాంగా ఉందన్నారు. ఎంతో పండుగ వాతావరణం లో ఉత్సాహ్వాంతంగా ఈ పోటిల్లో రెండు రాష్ట్రాల విద్యార్థులు పాల్గున్నారని మనోజ్ పేర్కొన్నారు. ఛాంపియన్ షిప్ను కైవసం చేసుకున్న గాజువాక ఎస్ఎఫ్ఎస్ స్కూల్ టీం, రన్నరప్ సీతమ్మధార ఎస్ ఎఫ్ ఎస్ స్కూల్ టీం ట్రోఫీలను చేత పట్టుకొని మైదానంలో వందలాది మంది క్రీడాకారుల కేరింతల మధ్య టాప్లెస్ జీపులో తిరిగి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాగా సోమవారం ఫాన్సీ డ్రెస్ పోటీల్లో గాజువాక ఎస్ఎఫ్ ఎస్ స్కూల్, కొటక్ సెలెషన్ స్కూల్, శాంతినగర్ ఎస్ ఎఫ్ ఎస్ స్కూల్ (సిబిఎస్సి) సెయింట్ అలోసియస్ స్కూల్, రాజుపాలెం ఎస్ఎఫ్ఎస్ స్కూల్, నాగులపాలెం ఎస్ఎఫ్ఎస్ స్కూల్ గెలుచుకున్నాయి.న్యాయం నిర్ణేతలుగా ప్రముఖ రంగస్థల దర్శకుడు బొడ్డేటి చంద్రశేఖర్, బుల్లితెర చిత్ర దర్శకులు సత్తివాడ శ్రీకాంత్ లు వ్యవహరించారు. పాటల పోటీలలో గాజువాక ఎస్ ఎఫ్ ఎస్ స్కూల్, శాంతి నగర్ లు ప్రథమ స్థానం పొందగా ద్వితీయ స్థానాన్ని పామిడి ఎస్ ఎఫ్ ఎస్ స్కూల్ గెలుచుకుంది. ప్రముఖ గాయకులు డబ్బీరు సత్యప్రసాద్, జానపద గాయకులు కే.ఆదినారాయణ, రాధలు న్యాయ నిర్నేతలుగా వ్యవహరించారు.