శ్రీ శ్రీ భక్త వరద వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శన కార్యక్రమం !! #vvwnews

by vvwnews.com

తూర్పు నియోజకవర్గం ఆరిలోవ 12వ వార్డులో శ్రీకాంత్ నగర్ రోడ్ నెంబర్ వన్ లో శ్రీ శ్రీ భక్త వరద వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శన కార్యక్రమం నిర్వహిస్తున్నామని కార్యక్రమం నిర్వహకులు కోటేశ్వరరావు గారు తెలిపారు.సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శ్రీ పరమానంద మాధవం సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రజలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉదయం సుప్రభాత సేవ మొదలుకొని పవళింపు సేవ వరకు నిర్వహింపబడే ఉదయాస్తమాన సేవలతో వైకుంఠ ద్వార దర్శనం ఇవ్వబోతున్నారని తెలియజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు, మరియు దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ, ఉత్తర నియోజకవర్గం విష్ణుకుమార్ రాజు గారు మరియు రాష్ట్ర బిజెపి అధ్యక్షులు మాధవ్ గారు, బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీ ఎం ఎం ఎన్ పరశురామరాజు గారుకార్యక్రమానికి వస్తున్నారని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో నిర్వాహకులు టి కోటేశ్వరరావు, జి మురళి, ఎం సన్యాసిరావు, ఎస్ లక్ష్మణారెడ్డి, ఎం వి ఎం వి సత్యనారాయణ, ఏ వేణు, ఎస్ త్రినాథ్ పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles