విశాఖ :
*పోలీసులు సామాజిక సేవల్లోనూ భాగస్వాములు కావాలి పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి*
2టౌన్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు విధి నిర్వహణతో పాటు సామాజిక సేవలో కూడా భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరూ మానవసేవే మాధవసేవ అని భావించి ఉన్నంతలో తోటివారికి సహాయం చేయాలని. వృద్ధులుకి వైద్య పరీక్షలు భాగంగా కంటి పరీక్ష, బిపి సుగర్ పరీక్షలు చేసి అనంతరం పండ్లు , బకెట్లు మగ్గులు సీపీ చేతిమీదగా వృద్ధులు కి అందచేశారు. విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన టూటౌన్ లా అండ్ ఆర్డర్, క్రైం, స్టేషన్ లను సందర్శించారు. ఈ సందర్బంగా డీసీపీ 01 మణికంఠ చందోలు, ఈస్ట్ సబ్ డివిజన్ ఏసీపీ కే.లక్ష్మణమూర్తి, ఇంచార్జ్ క్రైం ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి, టూటౌన్ సీఐ వీ.వీ.సీ.ఎం.ఎర్రం నాయుడు, ఈస్ట్ సబ్ డివిజన్ క్రైం సీఐ సీహెచ్.రాజుల నాయుడు, సీసీఎస్ సీఐ కోరాడ రామారావు ఇతర అధికారులు, పండితుల వేదమంత్రోచ్చరణల నడుమ పూర్ణ కుంభంతో పోలీస్ కమిషనర్‌కు స్వాగతం పలికారు. అనంతరం సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అలాగే సిబ్బంది పని తీరు పై ఆరా తీశారు. స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించి, మొక్కలను నాటారు. శాంతిభద్రతల పరిరక్షణ, మహిళా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు నిబద్ధత తో పని చేయాలని పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి అధికారులకు ఆదేశించారు. సమర్థవంతంగా పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరుగకుండా చూసుకోవాలని, విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలన్నారు. డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సమస్య పరిష్కరించాలన్నారు. 32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు, 33వ వార్డు కార్పొరేటర్ బీశెట్టి వసంత లక్ష్మి, ఇతర ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో జరిగిన సేవా కార్యక్రమాలలో పోలీస్ కమిషనర్ శంఖబ్రత పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, నిరుపేదలకు పండ్లు ఫలాలను పంపిణి చేశారు. కార్యక్రమంలో ఎస్ఐలు సతీష్, మన్మధరావు, లక్ష్మి, సంధ్య, రమేష్, క్రైం ఎస్ఐ నాయుడు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.