కాలుష్యం మాది.. ఉద్యోగం ఏది..
నెల్లిమర్ల నియోజకవర్గంకి సంబదించిన తీర ప్రాంతంలో
ఎస్ ఎమ్ ఎస్ . మాట్రిక్స్.దివిస్ వంటి కంపెనీలనుంచి విడుదల చేస్తున్న వాయు మరియి నీటి కాలుష్యం వలన జీవరాసులు వృక్ష రాసులు.జలచరాలు మృత్యువాత పడుతున్నాయి.. సుమారు యాభై నుండి వందేళ్లు జీవించాల్సిన తాబేళ్ళు. చేపలు వంటి జల చరాలు రోజుకి వందల ప్రాణాలు కోల్పోయి సముద్ర వడ్డున పడి ఉన్నాయి. అలాగే చుట్టూ ప్రక్కల నివసిస్తున్న మనసులకు పశు పక్యాధులకు వాయు కాలుష్యం మూలాన ఆరోగ్య సమస్యలు తలెత్తి తీవ్ర అనారోగ్య0తో మరణిస్తున్నారు.. భూమి సారవంతం తగ్గిపోయే విషమయం అవడం వలన పంటలు సరిగ్గా పండడం లేదు.. వృక్షాల్లో జీవం లేదు.. ఇన్ని ఇబ్బందులు స్థానికులు అనుభవిస్తుంటే NMR ఉద్యోగం తప్ప ఇంకే ఉద్యోగ అవకాశం స్థానిక యువతకి దక్కడం లేదు.. చదువుకి తగ్గ కొలువు లేక స్థానిక యువత వలసలు వెళ్లిపోతున్నారు..అన్ని ఉన్న అల్లుడు నోట్లో శని ఉన్నట్టు.. ఒక పక్క నేషనల్ హైవే ఉన్న. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కి పెద్దపీట వేస్తున్న.. లెక్కకు మించి చిన్న పెద్ద పరిశ్రమలు నియోజకవర్గం లో మాట్రిక్స్. ఎస్ ఎమ్ ఎస్. సీపీ. Hbl. పదులసంఖ్యలో ivax వంటి ప్లై ఉడ్ కంపెనిలు నియోజకవర్గం అనుకోని ఉన్న అరబిందో. రెడ్డిస్ వంటి కంపెనిల్లో స్థానికులకు అవకాశం లేదు.. స్థానికులకు వలస తప్పలేదు.. కాలుష్యం వల్ల తిప్పలు తప్పలేదు..కంపెనిల్లా యాజమాన్యాలు నాయుకులుకి ఇచ్చే కాంట్రాక్టులను ద్రుష్టి పెట్టాయి తప్ప స్థానికులు ఎటువంటి ఉపయోగం లేదు.
ఇప్పటికైనా స్థానిక నేతలు MLA గారు జిల్లా కలెక్టర్ గారు. జిల్లా మంత్రివర్యులు అధికారులు..మరియు పూజ్యనీయులు రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు మరియు డిప్యుటీ సీఎం గారు చొరవ చూపించి స్థానికులను ఆదుకోగలరని మనవి..
మీ
తుమ్మి అప్పలరాజు దొర
8500044423