*ప్రింట్ మీడియా ప్రకటన*
*గిరిజన ప్రాంతాల్లో మంచు గడ్డలు – తీవ్ర చలి*
*విద్యార్థుల భద్రతకు తక్షణ చర్యలు తీసుకోవాలి*
*పాఠశాల సమయాల్లో మార్పులు చేయాలి*
*ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్ వాలంటీర్ల నియామకం చేయాలి*
*ఏపీ కాంగ్రెస్ పార్టీ పిసిసి డెలిగేట్ మెంబర్ పాచిపెంట చిన్నస్వామి డిమాండ్*
*అరకు వెల్లి నియోజకవర్గం*
*అరకువెల్లి మండలం | తేదీ : 19-12-2025*
*అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని అరకు, పాడేరు, మారేడుమిల్లి తదితర గిరిజన ప్రాంతాల్లో ప్రస్తుతం మంచు గడ్డలు ఏర్పడుతూ తీవ్రమైన చలి వాతావరణం నెలకొని ఉందని ఏపీ కాంగ్రెస్ పార్టీ పిసిసి డెలిగేట్ మెంబర్ పాచిపెంట చిన్నస్వామి తెలిపారు. ఈ సందర్భంగా అరకువెల్లి మండల కేంద్రంలోని సీ కాలనీ వీధిలో మీడియా మిత్రులకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు*.
*తీవ్ర చలి కారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే గిరిజన విద్యార్థులు పగటి వేళల్లో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాత్రివేళల్లో సరైన నిద్ర లేకపోవడం, ఉదయం చల్లనీటితో స్నానాలు చేయాల్సిన పరిస్థితి వల్ల గజ్జి, దురద, తామర వంటి చర్మవ్యాధులు, జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి వంటి సమస్యలతో విద్యార్థులు బాధపడుతూ విద్యకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే వయస్సు పైబడిన ఉపాధ్యాయులు కూడా బీపీ, షుగర్, గుండె సంబంధిత వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు*.
*ఈ నేపథ్యంలో గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పాఠశాల సమయాల్లో తగిన మార్పులు, చేర్పులు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే కూటమి రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు తొలి సంతకం అమలు చేస్తూ ప్రతి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో హెల్త్ వాలంటీర్లను వెంటనే నియమించాలి అని కోరారు*.
*అల్లూరి జిల్లా కలెక్టర్ గారు, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారులు చలి తీవ్రత తగ్గే వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గిరిజన విద్యార్థులకు రగ్గులు, చలి బనియన్లు, స్నానాలకూ త్రాగడానికి వేడి నీటి సదుపాయాలు కల్పించి వారి ఆరోగ్యం, భద్రతను కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు*.
*ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏం. ప్రేమ్ కుమార్, ఓబీసీ జిల్లా చైర్మన్ కన్నూరి ప్రవీణ్, సీనియర్ నాయకులు శెట్టి భగత్ రామ్, యూత్ కాంగ్రెస్ నాయకుడు బంగురు యాదయ్య, ఆదివాసి మేధవుల ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శి పూజారి రామ నాగేశ్వరరావు, ట్రైబల్ డిజేబుల్ వెల్ఫేర్ సొసైటీ అల్లూరి జిల్లా చైర్పర్సన్ బోరిబోరి ధర్మయ్య తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు*.
–