సనాతన భారతీయం ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ సమ్మర్ క్యాంప్ ప్రారంభం
విశాఖపట్నం:-
సనాతన భారతీయం పేరుతో ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ సమ్మర్ క్యాంపును ఎంవిపి కాలనీలోని ఐఐఏఎం విద్యా సంస్థ ప్రాంగణంలో ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శివానంద సుపథ ఫౌండేషన్ కోఆర్డినేటర్ ఎన్ రాధాకుమారి మాట్లాడుతూ
ఈనెల 26వ తేదీ నుండి నుండి మే మూడవ తేదీ వరకు ఈ క్యాంపు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఎంవిపి కాలనీలోని ఐఐఏఎం లో ప్రతిరోజు ఉదయం 9:30 నుండి 11:30 వరకు ఉంటుందన్నారు. అదేవిధంగా ఉదయం 7 నుండి సాయంత్రం 6 వరకు భీమిలి పట్నంలోని
ఆనందవన్, శివానంద సుపథ ఫౌండేషన్ లో ఈ శిబిరం కొనసాగుతుందని చెప్పారు. భీమునిపట్నం ఆనందవన్, శివానంద సుపథ ఫౌండేషన్ లో మే మూడో తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఈ వేసవి శిబిరం ముగింపు కార్యక్రమం ఉంటుందన్నారు.
తొమ్మిది & అంతకంటే ఎక్కువ తరగతులు అభ్యసిస్తున్న విద్యార్థులు కోసం ఈ క్యాంపు నిర్వహణ జరుగుతుందన్నారు. విద్యార్థులకు సనాతన జ్ఞాన వ్యవస్థలను పరిచయం చేయడము, వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు, చరిత్ర, లలిత కళలు, పాలన, పౌరసత్వం లాంటి అంశాలపై సదస్సుల్లో శిక్షణ ఉంటుందన్నారు.
వేద గణితం, భారతీయ జ్యోతిషశాస్త్రం (జ్యోతిష), ఆయుర్వేదం యొక్క ప్రాముఖ్యత, రక్షణ వ్యవస్థలు పై ప్రత్యేక బోధన ఉంటుందని చెప్పారు. ఉదయం యోగా, అకడమిక్ సెషన్లు, సాయంత్రం భారతీయ సంప్రదాయ ఆటలు, తెలుగు నీతి శతకాలు & సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. డాక్టర్ ఆర్వీఎస్ఎస్ అవధానులు, ప్రొఫెసర్ ఎస్. కమలాకర శర్మ, పీ. ఈశ్వరరావు, మరియు ఇతరులతో సహా 10 మంది ప్రముఖ పండితులు చే శిక్షణ ఉంటుందని చెప్పారు. పాల్గొనే విద్యార్థులకు భోజనము వసతి ఉచితంగానే అందిస్తున్నట్లు తెలిపారు.