సాంప్రదాయ వస్త్రాల వీఆర్ సిల్క్స్ ప్రారంభం..
ప్రముఖ యాంకర్ శ్రీముఖి సందడి
ఆధునిక, సంప్రదాయ వస్త్రాల నిలయం వీఆర్ స్కిల్క్స్ షాపింగ్ మాల్ ను ప్రముఖ యాంకర్ శ్రీముఖి బుధవారం ప్రారంభించారు. ఈ షాపింగ్ మాల్ ను ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర సంపత్ వినాయక గుడి ఎదురుగా ఏర్పాటు చేయగా ప్రారంభించిన శ్రీముఖి మాట్లాడుతూ నాణ్యతతో కూడిన బట్టలను అతి తక్కువ ధరకు అందిస్తూ కస్టమర్ల ఆదరాభిమానాలు చూరగొనాలన్నారు. రాబోయే క్రిస్మస్, సంక్రాంతి వేడుకలకు ఇది ఒక ఉత్తమ ఎంపిక అవుతుందన్నారు. ఈ సందర్భంగా వీఆర్ సిల్క్స్ ఎండీ ఏ రాణి మాట్లాడుతూ డిజైనర్ శారీస్తో మీ ముందుకు వచ్చామన్నారు. కంచి, ధర్మవరం, బనారస్ కు చెందిన స్వచ్ఛమైన చేనేత చీరలు తమ వద్ద కలవన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయన్నారు. డ్రెస్ మెటీరియల్ ఒకటి కొంటే మూడు, పట్టు చీరలు ఒకటి కొంటే రెండు పొందే ఆఫర్ ఉందన్నారు. పట్టు చీరలపై 70, 60, 50 శాతం డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయన్నారు. అత్యుత్తమ నాణ్యత, అతి తక్కువ ధరలు మా ప్రత్యేకత అన్నారు.
ప్రముఖ యాంకర్ శ్రీముఖి సందడి…
వీఆర్ సిల్క్స్ ప్రారంభోత్సవానికి ప్రముఖ యాంకర్ శ్రీముఖి విచ్చేసారని తెలియడంతో ఆమె అభిమానులు ఉదయం నుంచే ఈ షాపింగ్ మాల్ ప్రాంతానికి భారీగా చేరుకున్నారు. శ్రీముఖి అభిమానులతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. ఆమె వచ్చి నేరుగా షాపింగ్ మాల్ ప్రారంభించారు. అనంతరం షాపింగ్ మాల్ కలియతిరిగారు. చీరల నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశారు. హాయ్ వైజాగ్ అంటూ అభిమానులను ఉత్సాహపరిచారు. విశాఖ అంటే ఎంతో ఇష్టమన్నారు. అభిమానులకు సెల్ఫీలు ఇచ్చారు. కార్యక్రమంలో సంస్థ చైర్మన్ మిసెస్ వెంకటరాణి, డైరెక్టర్ జామి హర్షవర్ధన, సిఏ టిఏ వినాయక రావు, తదితరులు పాల్గొన్నారు.