లారీల రవాణా విషయంలో కొన్ని సమస్యలు ఎదురైతే ఆ సమస్యలన్నీ సానుకూలంగా పరిష్కరించుకొని శాంతియుత వాతావరణం లో వ్యాపారాలు చేయగలుగుతున్నామని విశాఖ ట్రాన్స్పోర్ట్ సప్లయర్స్ ఎలియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు తెలియజేశారు. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ ను పాత గాజువాకలో నిర్వహించారు. ప్రధానంగా విజయవాడ వలే ఇక్కడ ఆటోనగర్ కానీ ట్రాన్స్పోర్ట్ నగర్ కానీ ఏర్పాటు చేయాలని ప్రజా ప్రతినిధులను కలిసి వినతి పత్రాలు ఇచ్చామని దానికి ఇటువంటి స్పందన లేదని అన్నారు. అలాగే భారీ వెహికల్స్ కి పోలీసులు అనుమతి ఉండడం లేదని మధ్యాహ్నం 12 నుంచి నాలుగు గంటల దాకా హెవీ వెహికల్స్ తిరిగే సమయం కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎదురైన ఎన్నో సమస్యలను సానుకూలంగా మా కమిటీ సభ్యులు అంతా కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించు కోగలిగామని అన్నారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ సంఘం సభ్యులు సత్యనారాయణ, లక్కీ భాస్కర్, మహారధి, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
విశాఖ ట్రాన్స్పోర్ట్ సప్లయర్స్ ఎలియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు తెలియజేశారు.
by vvwnews.com
written by vvwnews.com
12
previous post