యుద్ధ కళల పట్ల ప్రతి ఒక్కరూ ఆసక్తి పెంపొందించుకోవాలని బిజెపి ఫ్లోర్ లీడర్, ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్ రాజు అన్నారు. మర్రిపాలెం అంబేద్కర్ భవన్ లో ఫస్ట్ ఓపెన్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్నేషనల్ ఒకినవాన్ షోరినర్యు సెబుకన్ కరాటి ఛాంపియన్షిప్ ను జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన ప్రారంభించారు. నిర్వాహకుడు శివ గణేష్ ఆధ్వర్యంలో ట్రోపీను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చిన్నారుల్లో శారీరిక మానసిక సమతుల్యతకు, సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకునేందుకు మార్షల్ ఆర్ట్స్ దోహదం చేస్తాయన్నారు. పిల్లల్లో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతైనా అవసరం ఉందన్నారు. అనంతరం మాజీ ఏడీసీపీ కింజరాపు ప్రభాకర్ విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉత్తర నియోజకవర్గం ఇంచార్జ్ పసుపులేటి ఉషాకిరణ్, 53వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి నీరుకొండ దివాకర్, అసోసియేషన్ సభ్యులు, చిన్నారుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
యుద్ధ కళల పట్లప్రతి ఒక్కరూ ఆసక్తి పెంపొందించుకోవాలని బిజెపి ఫ్లోర్ లీడర్ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే
13