41వ వార్డు ఆధ్వర్యంలో జగనన్న జన్మదినోత్సవం…
* ఘనంగా ముందస్తు సంబరాలు చేసిన కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, శ్రీధర్లు
కంచరపాలెం, డిసెంబర్ 13, (ఆంధ్రప్రభ): దక్షిణ నియోజకవర్గ పరిధి
41వ వార్డ్ వైసీపీ కోర్పరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, కోడిగుడ్ల శ్రీధర్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముందస్తు జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా మధురవాడ జాతరలో వార్డు వైసీపీ శ్రేణులు, ప్రజలతో కలిసి పలు సంస్కృతిక కార్యక్రమాల నడుమ ఆటపాఠలు ఏర్పాటు చేసి పండగ వాతావరణం లో పూర్ణిమ, శ్రీధర్ కేక్ కట్ చేసారు.అనంతరం మహిళలకు పలు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. ఈ సందర్బంగా కోడిగుడ్ల శ్రీధర్, కోడిగుడ్ల పూర్ణిమ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మహిళా సాధికారత కోసం పెద్ద పిఠ వేసారన్నారు. జగన్ పాలనలో మహిళలకు స్వర్ణయుగమని గుర్తు చేశారు. అందుకే జగన్ స్ఫూర్తి తో నేడు వార్డ్ మహిళల కోసం ఈ వేడుకలు ఏర్పాటు చేశామన్నారు.కూటమి ప్రభుత్వం పాలనలో రాష్ట్రం కుంటుపడిందని, మహిళా సాధికాత సన్నగిల్లిందని అన్నారు.ప్రజలు మళ్ళీ జగన్ పాలననే కోరుకుంటున్నారని,వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేసారు.జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ముందుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం ఎంతో సంతృప్తినిస్తుందన్నారు.తమను ఎంతగానో అందరిస్తున్న వార్డ్ ప్రజలకు, మహిళలకు రుణపడి ఉంటామన్నారు. ఈ సందర్బంగా మహిళలకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి బహుమతులు అందజేసారు. అనంతరం ఏర్పాటు చేసిన సంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమం లో వైసీపీ సీనియర్ నాయకుడు వేళంగిని రావు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.