6.సీతంరాజు
పారిశుద్ధ్య కార్మికులు ప్రజలకు అందిస్తున్న సేవలను విశాఖ దక్షిణ నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చైర్ పర్సన్ సీతంరాజు సుధాకర్ కొనియాడారు. 33 వ వార్డు టిడిపి అధ్యక్షుడు కర్రి నీలకంఠం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సానిటరీ సిబ్బందికి టి షర్ట్స్, చీరలు పంపిణీ చేశారు. అనంతరం వారికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. 33వ వార్డులో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీతంరాజు సుధాకర్, కర్రి నీలకంఠం మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికులు నిత్యం ప్రజలకు సేవలు అందిస్తూ ఉంటారని తెలిపారు. వారు అందిస్తున్న సేవలు ఫలితంగా ప్రజలు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా నగరం పరిశుభ్రంగా ఉంటుందని అన్నారు. పారిశుధ్య కార్మికులకు తమ సహాయ సహకారాలు అన్నివేళలా ఉంటాయని సీతంరాజు సుధాకర్, కర్రి నీలకంఠం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు, ఊరుకూటి నారాయణ, వార్డ్ టీడీపీ కార్యదర్శి శరగడం భాస్కర్,శానిటరీ కార్మికులు, అధికారులు, బొడ్డు పోలరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు.