14
విశాఖ జీవీఎంసీ 14 వ వార్డు సీతమ్మధార, బాలయ్య శాస్త్రి లేఔట్ వద్ద వనదుర్గ పీఠంలో టీడీపీ సీనియర్ నాయకులు ముత్యాల హరిత ఆధ్వర్యంలో గురుస్వామీ స్వరూప్ సమక్షంలో దుర్గాదేవి పూజా మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత 15 సంవత్సరాలుగా వనదుర్గపీఠంలో స్వాములు అంతా కలిసి దీక్ష చేపడుతున్నామని తెలిపారు. సుమారు 300 మంది స్వాములు ఈ పీఠంలోనే దీక్ష చేస్తున్నారని, వారికీ కనీసం షెల్టర్ కూడా లేదని పేర్కొన్నారు. కూటమి నాయకులు దృష్టి సారిస్తే షెల్టర్ సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి అధ్యక్షులు గొంప ధర్మారావు, బర్ల బాలకృష్ణ, చిగురుపాటి కృష్ణ, జి.ఆదినారాయణ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.