అంగన్వాడి విభాగం అధ్యక్షురాలు తాటిపూడి రత్నం ఆధ్వర్యంలో ఘనంగా కె.కె రాజు పుట్టిన రోజు వేడుకలు

by vvwnews.com

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె రాజు పుట్టిన రోజు వేడుకలు 51 వ వార్డు అంగన్వాడి విభాగం అధ్యక్షురాలు తాటిపూడి రత్నం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 51వ వార్డ్ వుడా కాలనీలో ఉన్న కేర్ అండ్ లవ్ మానసిక వికలాంగుల పిల్లలకు కేకే రాజు జన్మదిన సందర్బంగా కేక్ కటింగ్, స్వీట్లు, బట్టలను పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా రత్నం మాట్లాడుతూ.. కేకే రాజు పుట్టినరోజు వేడుకలను మానసిక వికలాంగుల పిల్లల వద్ద జరుపుకోవడం చాలా ఆనందదాయకమన్నారు. జగనన్న సారధ్యంలో తామంతా కలిసికట్టుగా పనిచేసి వచ్చే ఎన్నికల్లో తమ నాయకుడు కేకే రాజును గెలిపించుకు తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ఇటువంటి పుట్టినరోజు వేడుకలు ఆయన మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ విశాఖ మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి, మాజీ కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ పైడి శ్రీను, పప్పల లక్ష్మణ్, పొన్నాడ అప్పారావు మాస్టర్, సినియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles