దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ HDFC బ్యాంక్ తన ప్రధాన CSR కార్యక్రమం ‘ #vvwnews

by vvwnews.com

దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ HDFC బ్యాంక్ తన ప్రధాన CSR కార్యక్రమం ‘పరివర్తన్’ పేరిట 17వ వార్షిక రక్తదాన మహోత్సవాన్ని నిర్వహించింది. అందులో భాగంగా సీతమ్మధారలోని hdfc బ్యాంకు వద్ద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి విచ్చేశి జ్యోతి ప్రజలను చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్తదాతలను ఆయన అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రక్తదానం చేయడం ద్వారా సమాజానికి మేలు చేయాలని, అవసరంలో ఉన్నవారికి జీవనాధారం అందించాలంటూ పిలుపునిచ్చారు. బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ.. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ప్రజలను రక్తదానం చేయమని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా ప్రముఖ రక్తనిధులు మరియు ఆరోగ్య సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్టు చెప్పారు. గతంలో కూడా HDFC బ్యాంక్ అనేకసార్లు రక్తదాన శిబిరాలు నిర్వహించిదన్నారు. ప్రజలను సామాజిక సేవలో భాగం కావాలని కోరారు. 2013లో ఇదే కార్యక్రమం ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Use Social Media to Spread the Word about Our News

related articles