ప్రకృతి పంటల మేళాకు తరలి రండి
– డిసెంబర్ నెలలో 4 నుండి 7 వ తేదీ వరకు ఆర్గానిక్ మేళా
– ముఖ్య అతిథిగా వ్యావసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విచ్చేస్తున్నారు
– జలగం కుమారస్వామి, జాతీయ కార్యదర్శి, భారతీయ కిసాన్ సంఘ్
ప్రకృతి వ్యవసాయ రైతుల పంటల మేళాకు తరలి రండి అని భారతీయ కిసాన్ సంఘం జాతీయ కార్యదర్శి జలగం కుమారస్వామి పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం విశాఖపట్నం లోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డిసెంబర్ నెలలో 4 నుండి 7 వ తేదీ వరకు నిర్వహించె మేళాను ప్రారంభించేందుకు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విచ్చేస్తున్నారు అని పేర్కొన్నారు. ఆరవ తేదీ ఎం ఎస్ ఎం ఇ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు వస్తున్నారన్నారు. ఈ మేళాను ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, వారాహి ఫెడరేషన్, హలొ వైజాగ్, టెర్రస్ గార్డెన్ గ్రూప్ లు, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ, అగ్రి డిఎన్ఎ వెంచర్స్ సంస్థల నేతృత్వంలో ఈ మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ, కార్యదర్శి పాలెం నేచురల్స్ అశోక్, ప్రకృతి రైతులు రిషీ, ఎన్ నరేంద్ర, పర్యావరణ ప్రముఖ్ రంగాచార్యులు, యోగ భారతి ప్రతినిధి పైడం నాయుడు, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం తదితర ప్రకృతి రైతులు పాల్గొన్నారు.
ప్రకృతి పంటల మేళాకు తరలి రండి #vvwnews #latestnews
19
previous post