36 వ వార్డ్ వైసీపీ ప్రెసిడెంట్ మహమ్మద్ అబ్దుల్ షకిల్ ఆధ్వర్యంలో 200 మంది ముస్లింలు వైసిపి తీర్థం

by vvwnews.com

*వైసీపీ గూటికి చేరిన 36వ వార్డు ముస్లింలు*.

* *పార్టీలోకి ఆహ్వానించిన వాసుపల్లి గణేష్ కుమార్*

వైసిపిలో చేరికలతో పార్టీ మరింత బలోపేతం దిశగా ముందుకు వెళ్తుందని మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. *36 వ వార్డ్ వైసీపీ ప్రెసిడెంట్ మహమ్మద్ అబ్దుల్ షకిల్ ఆధ్వర్యంలో 200 మంది ముస్లింలు వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. వాసుపల్లి సమక్షంలో వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు*. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు కూటమి ప్రభుత్వం నిలువునా ముంచిందన్నారు. కార్పొరేషన్ నిధులు కేటాయించకుండా విస్మరించారన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ లు నోటికి వచ్చిన హామీలు చెప్పి అధికారం వచ్చాక మేనిఫెస్టో నే గంగలో కలిపేసారని వాసుపల్లి గణేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణ నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న ముస్లిం సోదరుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నాయన్నారు. జగన్మోహన్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయాల కన్నా ఏదో చేస్తారని నమ్మి కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే ప్రజలను నిలువునా ముంచిందన్నారు. నేడు కూటమి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకంతో దక్షిణ నియోజకవర్గంలో భారీగా చేరికలు మొదలయ్యాయి అన్నారు. నేడు 200 మంది ముస్లింలు దక్షిణ వైసీపీలో చేరారని వాసుపల్లి గణేష్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో 36 వ వార్డ్ కార్పొరేటర్ చెన్నా జానకిరామ్, స్టేట్ కల్చల్వింగ్ సెక్రెటరీ సాగర్,జిల్ల బీసీ సెల్ ప్రెసిడెంట్ సనపల రవీంద్ర భారత్, సౌత్ యూత్ తాడి రవితేజ,సౌత్ మహమ్మద్ యాసిన్ (బాబ్జి ), ఉపాధ్యక్షులు కిషోర్, చెన్నా శ్రీధర్, కార్యదర్శులు స్వప్న, భాను, సోషల్ మీడియా అధ్యక్షుడు మహమ్మద్, బీసీ సెల్ అధ్యక్షుడు ప్రధాన్, పబ్లిసిటీ అధ్యక్షుడు మహమ్మద్ అనీస్, యూత్ విభాగం అధ్యక్షుడు అలమండ జగన్, మహమ్మద్ జాకిమ్, మహమ్మద్ తలహా, బసీర్, ఎస్సీ అధ్యక్షుడు బంగారు సత్యం, 29వ వార్డ్ అధ్యక్షులు పీతల వాసు,39వ వార్డ్ అధ్యక్షులు ముజీబ్ ఖాన్,తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles