కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం లో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో #vvwnews

by vvwnews.com

కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం లో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పార్టీ ఉత్తర నియోజకవర్గ ఇంచార్జి హాసిని వర్మ రాజు ఆధ్వర్యంలో NGGO కాలని వద్ద ఒక ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏ ఐ సి సి పరిశీలకులు సునీల్ కొండా జి ఆహిరే, ఏపి సీసీ వైస్ ప్రెసిడెంట్, పి సి సి పరిశీలకులు మార్టిన్ లూథర్, అమర్ జహ బెగ్ , వేగి వెంకటేష్, స్టేట్ యూత్ ప్రెసిడెంట్ లక్కరాజు రామారావు విచ్చేశారు. ఈ సందర్భంగా ఏ ఐ సి సి పరిశీలకులు సునీల్ కొండా జి ఆహిరే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో బలోపేతం దిశగా అడుగులు వేస్తుంది అని దాని కోసం పార్టీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అందుకే తాము ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అని తెలిపారు. గ్రామ స్థాయి నుండి పార్టీకి సేవ చేసిన సీనియర్ నాయకులు కార్యకర్తలను ఆయన ప్రశంసించారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బలహీన పడలేదని త్వరలో త్వరిత గతిన పునరుత్తేజం పొందుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles