జాతీయ సేవా పథకం సేవలు అనన్య సామాన్యం.
– ప్రకృతి ఆధారంగా పండిన పంటలను ఆహారంగా తీసుకుందాం.
– పర్యావరణ హితంగా జీవించుదాం
– ప్రతి ఒక్కరూ పది మొక్కలు నాటి పెంచుదాం
– జెవి రత్నం, వ్యవస్థాపక కార్యదర్శి,గ్రీన్ క్లైమేట్ టీం
జాతీయ సేవా పథకం సేవలు అనన్య సామాన్యం అని
గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పేర్కొన్నారు. సోమవారం ఉదయం విశాఖపట్నం లోని జాలాది పేటలో ఎ ఎస్ రాజా మహిళా జూనియర్ కళాశాల జాతీయ సేవా పథకం (ఎన్ ఎస్ ఎస్) విద్యార్థులు వారం రోజుల సేవా కార్యక్రమాలు ప్రిన్సిపాల్ డాక్టర్ కాసు అధ్యక్షతన ప్రారంభం అయ్యాయి. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రకృతి ఆధారంగా పండిన పంటలను ఆహారంగా తీసుకుందాం అన్నారు. ప్రకృతి ఆధారంగా పంటలు పండించడం ఎలా అనేది వివరించారు. పర్యావరణ హితంగా జీవించుదాం అని పేర్కొన్నారు. ఇందూకు ప్రతి ఒక్కరూ ఏమి చేయాలో వివరించారు.
ప్రతి ఒక్కరూ పది మొక్కలు నాటి పెంచుదాం అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సైకాలజిస్ట్ వి సతీష్ మాట్లాడుతూ విద్యార్థులకు జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏమి చేయాలో టిప్స్ నేర్పించి ఆకట్టుకున్నారు. విద్యార్థులు ఉత్సాహంగా, సునాయాసంగా ఏ విధంగా చదువుకోవాలి, ఎంత పెద్ద అంశం అయినా ఏవిధంగా గుర్తుంచుకోవాలి వివరించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు పి సుశీల, సి హెచ్ స్వాతి ల నేతృత్వంలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ అందించిన తెలుపు, నలుపు వంగ, టమాటా, బాపట్ల మిర్చి, దేశీయ బంతి నారు పంపిణీ చేశారు. అలాగే ఎయిడ్స్ డే సందర్భంగా వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అలాగే ఏక్షన్ ఎయిడ్ కర్ణాటక ప్రాజెక్ట్స్ హెచ్ ఆర్ డి ఐ. కృష్ణ కుమారి పాల్గొన్నారు.
జాతీయ సేవా పథకం సేవలు అనన్య సామాన్యం.#vvwnews
11