వైజాగ్‌లో క్యాన్సర్ చికిత్సకు నూతన శకం
100 రోబోటిక్ ఆంకో-సర్జరీల మైలురాయిని అధిగమించిన మెడికవర్ హాస్పిటల్స్
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ , పరిసర ప్రాంతాలలో క్యాన్సర్ చికిత్సలో ఒక చారిత్రక ఘట్టంగా, విశాఖపట్నంలోని మెడికవర్ హాస్పిటల్స్ అత్యంత క్లిష్టమైన 100 రోబోటిక్ క్యాన్సర్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసింది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన, అధిక-ఖచ్చితత్వంతో కూడిన క్యాన్సర్ సంరక్షణను స్థానికంగా అందించడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని చీఫ్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ & రోబోటిక్ సర్జన్ డా. వి. కార్తీక్ చంద్ర తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం వెంకోజిపాలెం మెడికవర్ హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు గడిచిన ఏడాది లో 396 రోబోటిక్ సర్జరీ లు జరిగాయని అందులో 100 రోబోటిక్ ఆంకో-సర్జరీ లు నిర్వహిచడం జరిగిందని తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక రోబోటిక్ సర్జికల్ ప్రోగ్రామ్‌కు తాను నాయకత్వం వహించడం జరిగిందని తెలిపారు. ఈ శస్త్రచికిత్సలు అత్యంత అధునాతన రోబోటిక్ వ్యవస్థలలో ఒకటైన 4వ జనరేషన్ ‘దా విన్సీ ఎక్స్ ‘ రోబోటిక్ సర్జికల్ ప్లాట్‌ఫామ్ ఉపయోగించి నిర్వహించబడ్డాయని ఈ వ్యవస్థ యొక్క హై-డెఫినిషన్ 3డి విజన్ అసాధారణమైన ఫ్లెక్సిబిలిటీ అత్యంత సున్నితమైన లోతైన ప్రదేశాలలో కూడా అత్యధిక ఖచ్చితత్వాన్ని సాధించడానికి వీలు కల్పిస్తాయని ఆయన తెలిపారు. ఈ అధునాతన సాంకేతికత ద్వార క్లిష్ట పరిస్థితులలో ఉన్న రోగులకు వృద్ధ రోగులు ,ఊబకాయం ఉన్న రోగులు , క్లిష్టమైన కటి, , లోతైన కణితుల తో బాధపడే రోగులకు వరంగా మారిందని “ప్రపంచ స్థాయి, కనిష్ట-చొచ్చుకుపోయే క్యాన్సర్ శస్త్రచికిత్సను అత్యధిక ఖచ్చితత్వం , భద్రతా ప్రమాణాలతో అందించడం మా లక్ష్యమని , ఈ 100 రోబోటిక్ ఆంకో-సర్జరీల మైలురాయి మా బృందం యొక్క అంకితభావానికి, రోగులు సహోద్యోగుల నమ్మకానికి, వైజాగ్‌లో క్యాన్సర్ సంరక్షణ పురోగతికి నిదర్శనం” అని అన్నారు. ఇప్పటివరకు నిర్వహించిన శస్త్రచికిత్స లలో గర్భాశయ (ఎండోమెట్రియల్) క్యాన్సర్ సర్జరీలు, జీర్ణకోశ క్యాన్సర్ సర్జరీలు , థైరాయిడ్ సర్జరీలు వంటివి ఉన్నాయని తెలిపారు. సాంప్రదాయ ఓపెన్ సర్జరీతో పోలిస్తే, రోబోటిక్ విధానం రోగులకు గణనీయమైన ప్రయోజనాలను అందిస్తుందని ముఖ్యంగా తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం , తక్కువ సమస్యలు ,వేగవంతంగా కోలుకోవడం , తక్కువ ఆసుపత్రి బస వంటి ఈ ప్రయోజనాలు రోగులు త్వరగా తమ సాధారణ జీవితానికి తిరిగి రావడానికి సహాయపడతాయి.
అనంతరం యూరాలజిస్ట్ డాక్టర్ చోడిశెట్టి సుబ్బారావు మాట్లాడుతూ తన విభాగం లో ఇప్పటివరకు 60 కి పైగా రోబోటిక్ సర్జరీలు చేయటం జరిగినదని ఈ కార్యక్రమానికి అనస్థీటిస్టులు, నర్సింగ్ నిపుణులు సాంకేతిక నిపుణులతో కూడిన నిష్ణాతులైన బృందం సహకారం అందించిందని , దీనికి డా. కార్తీక్ చంద్ర ఉత్తమ సహకారం అందించారని ఆయన ముంబైలోని ప్రతిష్టాత్మక టాటా మెమోరియల్ హాస్పిటల్ లో శిక్షణ పొందారని . లాపరోస్కోపిక్ రోబోటిక్ సర్జరీలలో ఆయనకు విస్తృత అనుభవం ఉందని తెలిపారు.
అనంతరం మెడికవర్ హాస్పిటల్స్‌లో సీనియర్ కన్సల్టెంట్ ప్రసూతి గైనకాలజిస్ట్ అయిన డాక్టర్ కిరణ్మయి గొట్టపు మాట్లాడుతూ డాక్టర్ కార్తీక్ చంద్ర బృందం సహకారం తో ఎన్నో రోబోటిక్ సర్జరీ లు విజయవంతంగా నిర్వహించడం జరిగిందని అందులో ముఖ్యంగా గర్భాశయ తొలగింపు, మైయోమెక్టమీ, ఎండోమెట్రియోసిస్ చికిత్స, అండాశయ తిత్తుల తొలగింపు వంటి వి ఉన్నయని ఈ అధునాతన సాంకేతికత సంక్లిష్టమైన గైనకాలజీ పరిస్థితులకు కూడా సురక్షితమైన సమర్థవంతమైన చికిత్సను అందించడానికి వీలు కల్పిస్తుందని ఆమె అన్నారు. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ యాజమాన్యం డాక్టర్ కార్తీక్ చంద్ర అతని బృందాన్ని అభినందించింది. ఈ సమావేశం లో డాక్టర్ స్వర్ణ , మెడికవర్ సెంటర్ హెడ్ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.