4 నుండి 7 వ తేదీ వరకు విశాఖ లో ప్రకృతి పంటల మేళా.
– ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్ లో మేళా
– జలగం కుమారస్వామి, జాతీయ కార్యదర్శి, భారతీయ కిసాన్ సంఘ్
డిసెంబర్ నెలలో 4 వ తేదీ నుండి 7 వరకు విశాఖ లో ప్రకృతి పంటల మేళాను జయప్రదం చేయండి అని భారతీయ కిసాన్ సంఘం జాతీయ కార్యదర్శి జలగం కుమారస్వామి పిలుపునిచ్చారు. ఈ మేరకు విశాఖపట్నం లోని శివాజీ పార్క్ లో మిద్దె తోటల ప్రకృతి రైతుల వనమాలి, సిటిజి, గ్రూప్ ల ముఖ్య నిర్వాహకులు అరవల అరుణ, మళ్ళ సరిత, నాదెళ్ల జ్యోతిల నేతృత్వంలో శివాజీ పార్క్ లో నిర్వహించిన వన మహోత్సవంలో ఆర్గానిక్ మేళా గోడ పత్రికను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్ లో మేళా నిర్వహిస్తున్నామని, దీనిని జయప్రదం చేయడంలో మిద్దె తోటల ప్రకృతి రైతుల పాత్ర ప్రధానమైనది అని వివరించారు. ఈ గో ఆధారిత ప్రకృతి రైతుల పంటల ఆరవ మేళాను జయప్రదం చేయడం మన బాధ్యత అన్నారు. మనందరం కలసి ఆర్గానిక్ మేళాను జయప్రదం చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ ప్రకృతి ఆధారంగా పండిన ఆహారం భుజించి ఆరోగ్యంగా జీవించుదాం అన్నారు.
ఈ కార్యక్రమంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ, ప్రకృతి రైతు రిషీ, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం, వనమాలి, సిటిజి, వైజాగ్ గార్డెనర్స్ సొసైటీ, మన కూరగాయల తోట తదితర ప్రకృతి ఆధారంగా పంటలు పండించే మిద్దె తోటల రైతులు పాల్గొన్నారు.
4 నుండి 7 వ తేదీ వరకు విశాఖ లో ప్రకృతి పంటల మేళా. #vvwnews
14