కొండకర్ల ఆవలో చేపలు వేట తో బ్రతికేవారికి చేయూత ఇద్దాం
– ఐ.కృష్ణకుమారి. అనకాపల్లి ఫెసిలిటేటర్, ఏక్షన్ ఎయిడ్ కర్ణాటక ప్రోజెక్ట్స్.
కొండకర్ల ఆవలో చేపలు వేట తో బ్రతికేవారికి చేయూత ఇద్దాం అని ఏక్షన్ ఎయిడ్ కర్ణాటక ప్రోజెక్ట్స్ అనకాపల్లి ఫెసిలిటేటర్ ఐ కృష్ణ కుమారి అన్నారు. ఈ మేరకు గురువారం ఉదయం అనకాపల్లి జిల్లా కొండకర్ల ఆవ దగ్గర కొండకర్ల, వాడ్రాపల్లి, మల్లవరం గ్రామాలకు చెందిన చేపలు వేట తో బ్రతికేవారు 256 మందికి రగ్గులు, కార్చి లైట్లు, దోమలు రాకుండా చేసే అగర్ బత్తి పంపిణీ చేసిన అనంతరం ఆమె మాట్లాడారు. తమ సంస్థ తుఫాన్ బాధితులకు, నిరుపేదలకు చేయూత ఇవ్వడం జరుగుతుంది అన్నారు. ప్రతి ఒక్కరూ ఆదాయవంతంగా జీవించేందుకు తమ సంస్థ చేయూత ఇవ్వడం జరుగుతుంది అని వివరించారు.
ఈ కార్యక్రమంలో కొండకర్ల ఆవ ఇన్ ల్యాండ్ ఫిషర్ మేన్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం రమణ అప్పారావు, కార్యదర్శి దుర్గారావు, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం తదితరులు మాట్లాడారు.
కొండకర్ల ఆవలో చేపలు వేట తో బ్రతికేవారికి చేయూత ఇద్దాం #vvwnews
16