ఘనంగా యూనియన్ బ్యాంక్ 107 వ వార్షికోత్సవం…
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది 107 వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ 107 వవ్యవస్థాపక దినోత్సవమును పోర్ట్ కళావాణి ఆడిటోరియంలో విశాఖపట్నం జోనల్, రీజనల్ కార్యాలయము సంయుక్త నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జోనల్ హెడ్ హెచ్.టి వాసప్ప, రీజనల్ హెడ్ జే.సింహాచలం విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బ్యాంక్ ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు సిబ్బందికి తగు సూచనలిస్తూ, ఖాతాదారులకు మెరుగైన సేవలందించుటకు తాము పూర్తిస్థాయిలో నిబద్ధతతో ఎల్లప్పుడూ పనిచేస్తామని తెలిపారు. బ్యాంక్ ను ఉన్నత స్థితికి చేర్చుటకు సహకరించాలని ఖాతాదారులను కోరారు. భవిష్యత్తుల బ్యాంక్ మరెన్నో వ్యవస్థాపక దినోత్సవములను జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం నగరంలో గల వివిధ శాఖల ఖాతాదారులను ఘనంగా సత్కరించారు. ఉద్యోగులు వారి పిల్లలు వివిధ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొని ఆహుతులను అలరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జోనల్ అధికారులు శారదామూర్తి, శంకర్ హేంబరామ్, వివిధ శాఖల మేనేజర్లు, అధికారులు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, ఖాతాదారులు, అధిక సంఖ్యలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.