20
ఆరిలోవ 12వ వార్డు క్రాంతి నగర్ లో ఇళ్ల పక్కన డ్రైనేజీలో ప్రయాణించిన కొండచిలువ. భయభ్రాంతులతో పరుగులు తీసిన జనం. ఫారెస్ట్ అధికారులకు తెలియజేయగా ఒక వ్యక్తి వచ్చి అప్పటికి అది గోడలోకి దూరడంతో దానిని రెస్క్యూ చేయలేక వెను తిరిగాడు. దీనితో స్థానికులు బలవంతంగా తోక పట్టుకుని లాగి కొండ సిలువను బంధించారు. ఫారెస్ట్ సిబ్బంది నిర్లక్ష్యం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.