ప్రజలు అప్రమత్తంగా ఉండాలి !! #vvwnews #visakhanews

by vvwnews.com

మధ్యాహ్నం తర్వాత తుఫాను తీవ్రత పెరిగే అవకాశం
దయచేసి ఎవ్వరూ ఇళ్లల్లో నుంచి బయటకు రాకండి
*పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రజలకు సూచన*
ఈరోజు మధ్యాహ్నం తరువాత తుఫాను తీవ్రత పెరిగే అవకాశం ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేసిన సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రజల కోసం సూచన చేశారు. తుఫాను కారణంగా ముత్యాలమ్మ పాలెం సముద్రతీరాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు రోజులుగా ఈ తుఫాను తీవ్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేస్తుందని, అదేవిధంగా అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసి, ఎక్కడ ఆస్తి మరియు ప్రాణనష్టం జరగకుండా చూడడానికి కావలసిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రజలు ప్రభుత్వ సూచనలను పాటించి అత్యవసరము అయితే తప్ప దయచేసి బయటకు రాకుండా ఉండాలన్నారు. మధ్యాహ్నం తర్వాత తుఫాను తీవ్రత పెరిగే అవకాశం ఉండడం వలన చెట్లు పడిపోవడం, పిడుగులు పడడం వంటివి జరుగుతాయి కాబట్టి ప్రజలను బయటకు రావద్దన్నారు. తుఫాను బిల్డింగుల్లో తలదాచుకుంటున్న వారందరికీ అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశామని, భోజన వసతి, అనారోగ్యం పాలవకుండా డాక్టర్లను, కరెంటు సమస్య రాకుండా విద్యుత్ శాఖ అధికారులను అప్రమత్తం చేసామన్నారు. పాత గోడలు, కరెంటు స్తంభాల సమీపంలోనూ ఉండవద్దని సూచించారు. అన్ని శాఖల అధికారులు చాలా అప్రమత్తంగా పనిచేస్తున్నారని, ముఖ్యంగా పోలీస్ మరియు విద్యుత్ శాఖ అధికారులు రెవిన్యూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని, అన్ని శాఖల అధికారులు ఫోన్ నెంబర్లు పనిచేస్తాయని, ఎక్కడ ఏ ఇబ్బంది కలిగిన వెంటనే వారికి సమాచారం తెలియజేయాలని కోరారు.

Use Social Media to Spread the Word about Our News

related articles