నేల, నీరు, ప్రకృతిని నాశనం చేసే గూగుల్ డేటా సెంటర్కు ప్రశాంతమైన విశాఖను అప్పనంగా దారాదత్తం చెయ్యడానికి ఈ ప్రాంతం నీ అడ్డానా చంద్రబాబు అంటూ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ధ్వజమెత్తారు. ప్రజలు నమ్మి మీకు ఓటు వేసారని, కేవలం ఐదేళ్ల పాలనకు మాత్రమే మీకు ఇచ్చారని గుర్తుంచుకోవాలన్నారు. ఆసీలమెట్ట కార్యాలయంలో దక్షిణ వైసీపీ శ్రేణులతో వాసుపల్లి గణేష్ కుమార్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు, నారా లోకేష్ తీరుపై మండిపడ్డారు. ప్రజలను మోసం చేసి ప్రశాంతమైన విశాఖ నగర వనరులను నాశనం చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. ఈ డేటా సెంటర్ 1.8 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తుందని లోకేష్ చెప్పడం పచ్చి అబద్ధమని, దీనిపై శ్వేత పత్రం విడుదల చేయగలరా? అని వాసుపల్లి ప్రశ్నించారు. ఎటువంటి ఉద్యోగ కల్పన చేయలేని డేటా సెంటర్ కి 22 వేల కోట్లు సబ్సిడీలను ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. పర్యావరణాన్ని పూర్తిగా నాశనం చేసే ఈ సంస్థ వద్దని నిపుణులు మీకు సూచించలేదా చంద్రబాబు అంటూ వాసుపల్లి సూటిగా ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్, దక్షిణ వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు
నేల నీరు ప్రకృతిని నాశనం చేసే గూగుల్ డేటా సెంటర్కు ప్రశాంతమైన విశాఖను అప్పనంగా దారాదత్తం చేశారు
by vvwnews.com
written by vvwnews.com
16
previous post