*నవజాత శిశువుల ఆత్మీయ, ఆరోగ్య సమ్మేళనం*
గత 18 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తల్లీ, పిల్లల వైద్య విభాగంలో లోటస్ హాస్పిటల్స్ అందిస్తున్న విశేష సేవలు అభినందనీయమని కెజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ వాణి ప్రశంసించారు.శనివారం విశాఖలో లోటస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నవజాత శిశువుల ఆత్మీయ, ఆరోగ్య సమ్మేళనం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డాక్టర్ ఐ వాణి హాజరై తల్లీ, పిల్లల వైద్య విభాగంలో లోటస్ హాస్పిటల్స్ చేస్తున్న సేవలను కొనియాడారు.లోటస్ హాస్పిటల్స్ డైరెక్టర్ కెవి కృష్ణ వర్ధన్ మాట్లాడుతూ విశాఖపట్నంలో గత 10 సంవత్సరాల నుండి రెండు ఆసుపత్రులను విజయవంతంగా నిర్వహిస్తున్నామని, గత సంవత్సర కాలంలో నూతన నవజాతి శిశువుల (అప్పుడే పుట్టిన పిల్లలు) విభాగంలో సుమారు 150 మందికి పైన చిన్నారులకు విజయవంతంగా వైద్య సేవలు అందించి సురక్షితంగా మరియు ఆరోగ్యవంతంగా వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు తెలిపారు. అతి తక్కువ బరువుతో పుట్టిన చిన్నారులు సుమారు 500 గ్రాములు కూడా సరిగా లేని మరియు నెలలు నిండకుండా పుట్టిన చిన్నారులను కూడా ఆరోగ్యవంతంగా ఉంచినట్లు ఆయన తెలిపారు. నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ విభాగాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి నియోనాటాలజీ విభాగంలో డీఎం అర్హత సాధించి 25 సంవత్సరాల అనుభవం కలిగిన డాక్టర్ శేషగిరి ఎండీ (పీడియాట్రిక్స్ ), డిఎం (నియోనాటాలజీ ) ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీనివాస రెడ్డి ఎండీ (పీడియాట్రిక్స్ ) విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాలకు కూడా మంచి వైద్య ప్రమాణాలతో విస్తరిస్తున్నట్లు తెలిపారు.డాక్టర్ కె శేషగిరి మాట్లాడుతూ అతి తక్కువ బరువుతో పుట్టిన చిన్నారుల విషయంలో సాధారణంగా సగటున 50 శాతం మంది మృత్యుబారిన పడుతుంటారని, లోటస్ హాస్పిటల్ అలాంటి మరణాల శాతాన్ని పూర్తిగా నిర్మూలించాలనే దృక్పథంతో అధునాతన పరికరాలు మరియు అత్యున్నత అర్హత పొందిన వైద్యులను సమకూర్చి, తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.లోటస్ హాస్పిటల్స్ పై నమ్మకంతో సుమారు 60 రోజుల నుండి 90 రోజుల వరకు నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ విభాగంలో వైద్య సేవలు పొంది సురక్షితంగా తిరిగి వెళ్లిన చిన్నారుల తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా చిన్న పిల్లల పట్ల శ్రద్ధ, ఆసక్తి మరియు నిస్వార్థంతో సేవలు అందించి పిల్లల ఆరోగ్య సంరక్షణలో భాగస్వాములుగా నిలిచిన నర్సులను డాక్టర్ కె శేషగిరి బృందం ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సుబ్బరాజు, డాక్టర్ ఎం.శ్రీనివాస్,డాక్టర్ సిహెచ్. మాధురి ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.