డా. లంకపల్లి బుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో NASA ఇంటర్నేషనల్ స్పేస్ యాప్స్ చాలెంజ్–2025#vvwnews

by vvwnews.com

ప్రెస్ నోట్

డా. లంకపల్లి బుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో NASA ఇంటర్నేషనల్ స్పేస్ యాప్స్ చాలెంజ్–2025

విశాఖపట్నం, అక్టోబర్ 4: ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ హ్యాకథాన్ NASA ఇంటర్నేషనల్ స్పేస్ యాప్స్ చాలెంజ్ 2025 ను డా. లంకపల్లి బుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాల (ఆటోనమస్) ప్రాజ్ఞా రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో విజయవంతంగా నిర్వహించింది. “Learn, Launch, Lead” అనే అంశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం, నాసా ఓపెన్ సోర్స్ డేటాను ఉపయోగించి అంతరిక్ష శాస్త్రం, సాంకేతికత రంగాల్లో సృజనాత్మకత, ఆవిష్కరణ, సమస్య పరిష్కార నైపుణ్యాలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రారంభ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా విచ్చేసిన డా. అబ్రహాం వరుఘీసు, డైరెక్టర్, NSTL, విద్యార్థులు, పరిశోధకులను ప్రేరేపిస్తూ సమాజ సమస్యలను పరిష్కరించడానికి సృజనాత్మక ఆలోచన, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి దిశానిర్దేశం, నిరంతర సహకారం అందించిన డా. జి. మధుకుమార్, కార్యదర్శి & ప్రతినిధి కు కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రొఫెసర్ డా. దీపక్ చౌదరి, ప్రిన్సిపాల్, డి.ఎల్.బి.సి.ఈ. నిరంతర ఉత్సాహ ప్రోత్సాహకుడిగా నిలిచారు. అలాగే డా. జి.ఎస్.కె. చక్రవర్తి, ప్రిన్సిపాల్, డా. లంకపల్లి బుల్లయ్య కళాశాల, తన సహకారం, హాజరుతో కార్యక్రమాన్ని విశిష్టంగా మలిచారు.

కార్యక్రమాన్ని శ్రీ డి. భుజంగరావు, కోఆర్డినేటర్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, మరియు నిర్వాహక కమిటీ సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు.

ప్రపంచవ్యాప్తంగా NASA మరియు ISRO, ESA, JAXA, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ వంటి 14 అంతర్జాతీయ అంతరిక్ష సంస్థల భాగస్వామ్యంతో ఈ గ్లోబల్ హ్యాకథాన్ నిర్వహించబడుతోంది. 185కిపైగా దేశాల నుండి విద్యార్థులు, శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు పాల్గొని, NASA అందించే డేటాసెట్‌లు, ఎర్త్-ఆబ్జర్వేషన్ వనరులను వినియోగించి వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేస్తున్నారు.

ఈ సందర్భంగా విశాఖపట్నం మరియు పరిసర ప్రాంతాల నుండి 300 మందికి పైగా విద్యార్థులు 48 గంటల సుదీర్ఘ ఆవిష్కరణ చాలెంజ్‌లో పాల్గొన్నారు. పర్యావరణం, అంతరిక్షం, శాస్త్ర సంబంధిత సమస్యల పరిష్కారానికి తమ సృజనాత్మక ప్రతిపాదనలు సమర్పించారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో బహుశాఖా అభ్యాసాన్ని ప్రోత్సహించడమే కాకుండా, బృందపని, ఆవిష్కరణ, పారిశ్రామికోత్పత్తి పట్ల ఆసక్తిని పెంపొందించిందని నిర్వాహకులు తెలిపారు.

Use Social Media to Spread the Word about Our News

related articles