అర్చకులు, పురోహితులకు అండగా ఉంటాం
సమష్టిగా పనిచేస్తేనే అభివృద్ధి
మిలీనియం స్టార్ కంచర్ల ఉపేంద్ర బాబు
విశాఖపట్నం అక్టోబర్ 29 : సమిష్టిగా పనిచేస్తే అభివృద్ధి సాధ్యమని ప్రముఖ సినీ నటుడు, మిలీనియం స్టార్ కంచర్ల ఉపేంద్ర బాబు అన్నారు. బాలభాను పురోహిత మరియు అర్చక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కంబాలకొండలో నిర్వహించిన వనమహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి అర్చకులు పురోహితులు ఏకతాటిపై పనిచేయాలని సూచించారు. వీరి సంక్షేమం కోసం ఉపకార స్వచ్ఛంద సంస్థ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. సర్వేజనా సుఖినోభవంతు అంటూ అందరినీ ఆశీర్వదించే అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు ముందుకు రావాలని కోరారు. సినిమాల్లో నటించాలనే ఉత్సాహం ఉన్న యువతీ యువకుల కోసం తమ సంస్థ SSLCను సంప్రదించాలని కోరారు. అర్చక సంఘం అధ్యక్షులు జ్యోషుల కామేశ్వర శర్మ మాట్లాడుతూ తమ సంఘానికి స్థలం కేటాయించి భవన నిర్మాణానికి సాయం అందించాల్ని కోరగా సానుకూలంగా స్పందించారు.
అనంతరం యువ హీరోను అర్చక సంఘం ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బాలభాను అర్చక మరియు పురోహిత సంఘం వ్యవస్థాపకులు పంతుల వెంకటరమణ , మావుడూరు కిషోర్ కుమార్ శర్మ తో పాటు సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.