విశాఖ దక్షిణ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యగా పని చేస్తానని నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. 32వ వార్డు భీమ్ నగర్ లో ఆర్చ్ ను అలాగే అక్కడ సాయిబాబా, వినాయక ఆలయాల వద్ద మరో ఆర్చ్ ను ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 32వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. భీమ్ నగర్ ప్రాంత వాసులు ఎప్పటి నుంచో ఇక్కడ ఆర్చ్ నిర్మాణం చేయాలని అభ్యర్థిస్తున్నట్లు చెప్పారు. జివిఎంసి ఆధ్వర్యంలో రూపొందిన ఆర్చ్ లను నేడు ప్రారంభించడంజరిగిందని అన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ ^ డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాంత వాసుల చిరకాల ఆక్రాక్షను నెరవేర్చడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. భీమ్ నగర్ లో ఎప్పటి నుంచో ఈ ఆర్చ్ లను నిర్మించాలని అక్కడి వారు పలు మార్లు తనకు విన్నవించారని అన్నారు. ఈ ఆర్చ్ ల నిర్మాణం కోసం తాను చాలా కృషి చేసినట్లు వెల్లడించారు. రూ.15 లక్షల రూపాయలతో నిర్మించిన ఈ ఆర్చ్ లను నేడు ప్రారంభించామని అన్నారు. 32వ వార్డులో గల అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం తాను పని చేస్తున్నట్లు – తెలిపారు. అటు ప్రభుత్వ పథకాలు ప్రజలకు సక్రమంగా అందేలా చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈ వార్డులో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఈ
vsp దక్షిణ నియోజకవర్గాన్ని మోడల్ గా తీర్చిదిద్దడమే లక్ష్యగా పనిచేస్తానని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు
44