రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేలా నవంబర్ లో టూరిజం పాలసీ విడుదల..#vvwnews

by vvwnews.com

చేస్తామని, ఏప్రిల్ 2025 నుండి పాలసీ అమల్లోకి రానుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆదివారం సాయంత్రం విశాఖపట్నంలోని సర్క్యూట్ హౌస్ లో మీడియాతో మాట్లాడిన మంత్రి టూరిజం పాలసీకి సంబంధించి పలు అంశాలు వివరించారు. పర్యాటకులను ఆకర్షించేలా, స్టేక్ హోల్డర్లకు అనుకూలంగా ఉండేలా పాలసీ రూపకల్పనకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో చర్చించి, అటవీ శాఖతో సమన్వయం చేసుకొని జంగిల్ బెల్ ను వినియోగంలోకి తెస్తామన్నారు. సినిమల ద్వారా రాష్ట్ర పర్యాటకానికి ప్రాచుర్యం తీసుకురావాలని భావిస్తున్నామన్నారు. టూరిజం మీద లఘు చిత్రాల ద్వారా అవగాహన, ఆసక్తి కల్పిస్తామన్నారు. జనవరిలో విశాఖ ఉత్సవ్, బీచ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు చర్యలు చేపడతామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.

Use Social Media to Spread the Word about Our News

related articles