విశాఖ హనుమంతవాకలొ ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్) నందు ఈ మధ్యకాలంలో విజయవంతమైన అత్యాధునిక శాస్త్ర చికిత్సల వివరాలను తెలిపేందుకు సోమవారం విమ్స్ ఆస్పత్రిలో డైరెక్టర్ డాక్టర్ కే. రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాలు మెరుగు పరిచారు అన్నారు. స్టార్ యూనిట్ ఏర్పాటు కూడా ఏర్పాటు చేశాము అన్నారు,. నాలుగు గంటల్లో రూ.55 వేల ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా రోగి ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. పక్ష వాతంకి గురయిన రోగి ఆస్పత్రికి వచ్చిన రెండు గంటల్లో రోగి పరిస్థితి మెరుగు పడింది. వారం రోజుల్లో డిశ్చార్జి అయ్యారు అని గుర్తు చేశారు. గుండె పోటు, స్ట్రోక్ ఎంతో ప్రమాదకరం కావచ్చు అన్నారు. రోగిని గోల్డెన్ హవర్ అంటే మూడు గంటలు లోపు ఆస్పత్రికి తరలించాలి అని సూచించారు. సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రోలాజీ విభాగంలో అబ్దామినల్ వంటి అరుదైన సర్జరీలు చేస్తున్నాం. ఆస్పత్రిలో కొత్తగా క్యాన్సర్ విభాగం కూడా ఏర్పాటు చేశాము. మెడికల్, సర్జికల్ చికిత్స చేస్తున్నాం. వారంలో రెండు రోజులు క్యాన్సర్ రోగులకు చికిత్స చేస్తున్నాం. ఈ నేలను బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన మాసంగా పాటిస్తున్నారు. రోగి జగన్నాథ రావు మాట్లాడుతూ, పక్షవాతం వచ్చాక ఇంట్లో పడిపోయాను. వెంటనే విమ్స ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్య శ్రీ కింద చికిత్స చేశారు. గంట వ్యవధిలోనే ఆరోగ్యం మెరుగు పడింది అన్నారు. మీడియా సమావేశంలో వీమ్స్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
విశాఖ హనుమంతవాకలొ ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్) నందు #vvwnews
by vvwnews.com
written by vvwnews.com
66