విజయ దశమి పండుగ మనందరి జీవితాల్లో ఆనందం తీసుకు రావాలని విమ్స్ డైరెక్టర్ కె.రాంబాబు ఆకాంక్షించారు. ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్, ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరిగిన జర్నలిస్టుల దసరా పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాంబాబు మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టులు నిత్యం పని ఒత్తిడిలో ఉంటూ విశ్రాంతి లేని బిజీ జీవితం గడుపు తున్నారని వారికి, వారి కుటుంబాలకు పర్వ దినాల సందర్భంగా ఆహ్లాదం, ఆనందం కలిగించేందుకు ఇటువంటి సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు దోహదము చేస్తాయన్నారు.విమ్స్ లో జర్నలిస్ట్ లకు పూర్తి స్థాయీలో ఉచిత సేవలు నిరంతరం అందిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిజి. ఆంజనేయులు,జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు లు మాట్లాడుతూ విజయ దశమి పర్వదినంతో ప్రతీ ఒక్కరు మరింత ఉన్నతము గా ఉండాలి అని వీరు ఆకాంక్షి0చారు..జర్నలిస్టుల జీవితలక్ష్యం అయిన ఇండ్ల స్థలాల సాధన కోసం ప్రభుత్వ పెద్దలను పలుమార్లు కలసి విన్నవించామన్నారు. అది త్వరలోనే కూటమి ప్రభుత్వం ద్వారా సిద్ధిస్తుందని వీరు ఆశాభావం వ్యక్తం చేశారు. అర్హులైన జర్నలిస్టుల అక్రిడిటేషన్ సమస్యలు పరిష్కారం కోసం గట్టిగా ప్రయత్నిస్తామన్నారు. త్వరలో మంత్రులు ద్వారా జర్నలిస్ట్ ల సమస్యలు పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామన్నారు. అర్బన్ యూనిట్ ప్రధాన కార్యదర్శి జి. శ్రీనివాస్ రావు,ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈరోతి ఈశ్వరరావు, కార్యదర్శి మదన్, ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్, వివిధ కార్యవర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు.
విజయ దశమి పండుగ మనందరి జీవితాల్లో ఆనందం తీసుకు రావాలని విమ్స్ డైరెక్టర్..#vvwnews
by vvwnews.com
written by vvwnews.com
48