“అఖిల భారత మేజర్ పోర్టుల కార్మిక ద్రోహ దినము”

by vvwnews.com

*పోర్టులో అఖిల భారత ద్రోహ నిరసన దినాన్ని పాటించిన కార్మిక సంఘాలు*

విశాఖపట్నం:- మేజర్ పోర్ట్స్ మరియు డాక్ వర్కర్స్ ఫెడరేషన్ల నేషనల్ కో-ఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు విశాఖపట్నం పోర్ట్ ఉద్యోగులు ఇండియన్ మేజర్ పోర్ట్స్ యాజమాన్యాల వేతన సవరణ విధానాన్ని నిరసిస్తూ బుధవారం పోర్టు ఎ ఓ బి ముందు ద్రోహ దినాన్ని పాటించి నిరసన తెలిపారు.
విశాఖపట్నం హార్బర్ అండ్ పోర్టు వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) గౌరవ అధ్యక్షులు జె వి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ 2022 జనవరి నుండి అమలులోకి వచ్చే మేజర్ పోర్ట్స్‌లోని క్లాస్ – సి & డి ఉద్యోగుల వేతన సవరణ పరిష్కారాన్ని వెంటనే ముగించాలని డిమాండ్ చేస్తున్న యాజమాన్యాలు నిమ్మకు నిరీతిన్నట్టు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.ఇప్పటికి 27 నెలల వ్యవధిలో 8 దపాలు చర్చలు జరిగిన పురోగతి లేదని అన్నారు.క్లాస్ – సి & డి ఉద్యోగులకు వేతన పెంపును నిరాకరించడానికి ఇండియన్ పోర్ట్ మేనేజ్‌మెంట్ అశాస్త్రీయమైన మరియు నిరాధారమైన వాదనల నుండి వెనక్కి తగ్గాలని అన్నారు. క్లాస్-సి & డి పోర్ట్ ఉద్యోగులకు న్యాయమైన మరియు సహేతుకమైన వేతన పెంపును నిరాకరించడానికి మంత్రిత్వ శాఖ కార్మిక వ్యతిరేక మరియు అనైతిక ముందస్తు షరతులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మేజర్ పోర్ట్స్‌లోని క్లాస్ – సి & డి ఉద్యోగుల కష్టపడి సంపాదించిన మరియు స్థిరపడిన వేతన వ్యవస్థను దెబ్బతీసేందుకు ఉద్దేశించిన అన్ని ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలని అన్నారు.
కార్యక్రమంలో డి కె శర్మ (hms) పద్మనాభ రాజు (సీఐటీయూ), చందు(ఎన్ పి టి ఈ ), కనకరావు (జనతా పోర్టు), ఏఐటీయూసీ నుంచి ఆర్ రమనబాబు, పోతన్న, సత్తిరాజులు, కోటేశ్వరరావు, ప్రకాష్ ,జి చిన్నారావు ,ఎ సత్యానందరావు,పెన్షనర్ అసోసియేషన్ నేత పి ఎస్ ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles