ఐబీపి సెంచరీ క్లబ్ పై వస్తున్న ఆరోపణల అవాస్తవాలు
ఐబీపీ సెంచరీ క్లబ్ పై సస్పెండ్ అయిన సభ్యుడు కే శివాజీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలని వైబిపి సెంచరీ క్లబ్ అధ్యక్షులు వై దుర్గాప్రసాద్, కార్యదర్శి జవహర్లాల్ పేర్కొన్నారు.
బుధవారం సెంచరీ క్లబ్ రంగంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ క్రమశిక్షణ కారణాలతో కే శివాజీ అలాగే పి వెంకటరమణ ఇద్దరు సభ్యులు సస్పెండ్ అయ్యారని వారు ఇప్పుడు తమకులపై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తమ క్లబ్బు ప్రాంగణంలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఎటువంటి కార్యకలాపాలను ప్రోత్సహించడం లేదని అన్నారు.
డిఫెన్స్ మద్యం వంటి వాటిని తాము ఎప్పుడు అనుమతించమని చెప్పారు. వారు లేపిన ఆరోపణలు పూర్తి అవాస్తవాలను త్వరలో వారిపై పరువు నష్టం దావా వేయనున్నట్లు వెల్లడించారు.
మాజీ అధ్యక్షులు దిలీప్, మాజీ సెక్రటరీ అనిల్ బాబు మాట్లాడుతూ తమ క్లబ్ సభ్యులు సమాజంలో ప్రముఖులని చెప్పారు. వారు మంచి అర్హత కలగని వ్యక్తులను వారు క్లబ్ నిర్వహించే అన్ని కార్యక్రమాలలో చాలా చురుకుగా పాల్గొంటారని తెలిపారు. కే శివాజీ ఆరోపణలు పూర్తిగా అబద్దాలని చెప్పారు. తమ క్లబ్బును 1833 ఆగస్టు 11న రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందన్నారు. భారతదేశమంతటా 60 కంటే ఎక్కువ క్లబ్లో అనుబంధాన్ని కలిగి ఉండటం ద్వారా దక్షిణ భారతదేశంలో ప్రతిష్టాత్మక క్లబ్బులలో ఒకటిగా ఉందన్నారు. 2019 నుండి 2022 వరకు 70 నుండి 80 లక్షలు మొత్తం దయచేసి ఉపయోగించలేదని అతను ఈ విషయం పై లేవనెత్తిన ఆరోపణలు పూర్తి అవాస్తవాలని అన్నారు. ప్రభుత్వ అధికారులకు మా లెక్కలు చూపించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐ బి పి సెంచరీ క్లబ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.