కాకినాడ ఆదిత్య విద్యాసంస్థలలో ఫీజుల దోపిడి అరికట్టాలి.* #vvwnews

by vvwnews.com

*కాకినాడ ఆదిత్య విద్యాసంస్థలలో ఫీజుల దోపిడి అరికట్టాలి.*

అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ విశాఖపట్నం జిల్లా సమితి ఆధ్వర్యంలో ద్వారక నగర్ మూడవ లైన్ సమీపంలో ఆదిత్య కళాశాల వద్ద ఆందోళన నిర్వహించడం జరిగింది.ఈ
సందర్భంగా జిల్లా కార్యదర్శి ఉల్లం .నాగరాజు మాట్లాడుతూ కాకినాడ ఆదిత్య విద్య సంస్థలు కమర్షియల్ బిల్డింగ్ లలో విద్యను వ్యాపారంగా మారుస్తున్నాయని గత వారం రోజులుగా వివిధ రూపాలలో ప్రభుత్వ దృష్టికి లో పెట్టిన స్పందించకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో నిర్ణయించిన అండర్ గ్రాడ్యుయేట్ ఫీజు 8000 నుండి 14500 ఉండగా ఆదిత్య విద్యాసంస్థలు మొదటి సంవత్సరం దాదాపు 50 వేలు నుండి 60వేలు రెండో సంవత్సరం 60 నుండి 70 వేలు వరకు మూడింతలు ఫీజులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. అలాగే సెమిస్టర్ ఫీజ్ 1250 ఉండగా 2250 రూపాయలు అలాగే కాండోనేషన్ ఫీజు దాదాపు 65% 1000, 75% ఉంటే 500 రూపాయల వరకు డైరెక్ట్ గా యూనివర్సిటీకి చెల్లించాలని కానీ ఆదిత్య యాజమాన్యం 2000 పైబడి కాండోనేషన్ ఫీజు వసూలుచేసి కోట్ల రూపాయలు కూడగట్టు కుంటున్నారని విమర్శించారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలలో రోజురోజుకీ ఫీజుల దోపిడీ ఎక్కువ అవుతున్నా కూడా విద్యాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకునే సందర్భాలు ఎక్కడ కనిపించట్లేదని ఆరోపించారు. ఇది కేవలం విద్యాశాఖ అధికారుల వైఫల్యం కారణంగానే ఫీజుల దోపిడీ జరుగుతున్నట్లు ఆరోపించారు. ఓ పక్క జూనియర్ కళాశాలల పేరుతో పర్మిషన్ తీసుకుంటూ నీట్, ఐఐటి, జేఈఈ మెయిన్స్ పేరుతో విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తూ తల్లిదండ్రుల నుండి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్టు ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేద విద్యార్థుల పక్షాన లేరని ప్రైవేట్ ,కార్పొరేట్ విద్యా సంస్థలకు మద్దతిస్తున్నట్లు ఆరోపించారు. ఇప్పటికైనా విద్యాశాఖ జిల్లా యంత్రాంగం కదిలి కాకినాడ ఆదిత్య విద్య సంస్థలు మరియు ఇతర ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పి శేఖర్, ఉపాధ్యక్షులు అభిషేక్, కిరణ్ , సహాయ కార్యదర్శి మౌనిక, సమితి సభ్యులు కంజీర, గణేష్, రోహిత్, రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles