నేటి నుంచి శబలా భోజనాల సంబరాలు – ఏప్రిల్ 1 నుండి 5 తేది వరకూ నిర్వహించె శబల

by vvwnews.com

నేటి నుంచి శబలా భోజనాల సంబరాలు
– ఏప్రిల్ 1 నుండి 5 తేది వరకూ నిర్వహించె శబల భోజనాలనం జయప్రదం చేయండి
– మిల్లెట్స్ రాంబాబు.
శబల భోజనాలను జయప్రదం చేయండి అని మిల్లెట్స్ రాంబాబు పిలుపునిచ్చారు. మంగళవారం మధ్యాహ్నం విశాఖపట్నం లోని సింహాచలం కొత్త గోశాల వద్ద శబల భోజనాల పండుగ గురించి సేవ్ సంస్థ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సేవ్ సంస్థ ఆధ్వర్యంలో ఐదు రోజులు పాటు ఉచితంగా నిర్వహించె శబల భోజనాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఇందుకు గాను అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సేవ్ సంస్థ కో ఆర్డినేటర్ సురేంద్రనాద్ మాట్లాడుతూ ఈ శబల భోజనాలు పండుగను జయప్రదం చేయాలని కోరారు. వేలాది మంది ఈ భోజనాలు పండుగను జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎపి నర్సరీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఆకుల చలపతి రావు, తులసి నేచురల్స్ సత్యనారాయణ, ఉత్తర ఆంధ్ర జర్నలిస్ట్ ప్రంట్ అధ్యక్షులు వర్మ, ప్రకృతి వ్యవసాయదారుల సంఘం అధ్యక్షులు వర్మ, మేంగొ మేన్ అప్పాజీ, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles