ఎలిగెంట్ హోటల్‌ వేదికగా పోర్ట్ హై స్కూల్ 1983-84 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక సమావేశం

by vvwnews.com

విశాఖపట్నం రామనగర్‌లోని ఎలిగెంట్ హోటల్‌ వేదికగా పోర్ట్ హై స్కూల్ 1983-84 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక సమావేశం అత్యంత వేడుకగా జరిగింది. సరిగ్గా నాలుగు దశాబ్దాల తర్వాత తోటి స్నేహితులందరూ ఒకే చోట చేరడంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను, అలాగే తోటి మహిళా స్నేహితులను పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు సత్యన్నారాయణ, లింగం శ్రీనివాస్ మాట్లాడుతూ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే తమ గురువులను,పాత మిత్రులందరం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. వృత్తిరీత్యా వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడినప్పటికీ, స్కూల్ జ్ఞాపకాలను నెమరవేసుకోవడానికి ఈ వేదిక ఉపయోగపడిందని తెలిపారు. ముఖ్యంగా సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళా మూర్తులను, తమ తోటి స్నేహితులను గౌరవించుకోవడం ఈ వేడుకకు ప్రత్యేకతను తీసుకువచ్చిందని వారు పేర్కొన్నారు.సత్కారం అందుకున్న ఉపాధ్యాయులు పద్మావతి, వసుందర మాట్లాడుతూ, దశాబ్దాల క్రితం విద్యార్థులుగా ఉన్న వారు నేడు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగి, గురువులను గుర్తుపెట్టుకుని గౌరవించడం గర్వంగా ఉందన్నారు.ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు విజయలక్ష్మి, విజయకుమారి నిర్వాహకులు ఈటి ప్రసాద్,పూర్ణమ, భారతి, నందేశ్వర్, దివాకర్ పాల్గొన్నారు

Use Social Media to Spread the Word about Our News

related articles