30వ వార్డు, వార్డ్ బాయ్స్ కాలనీలో దివంగత కోన వీరస్వామి 18వ వర్ధంతి #vvwnews

by vvwnews.com

కోనా శంకర్…

విశాఖ దక్షిణ నియోజకవర్గం 30వ వార్డు, వార్డ్ బాయ్స్ కాలనీలో దివంగత కోన వీరస్వామి 18వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వైసీపీ దక్షిణ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సహకారంతో ఆయన కుమారులు జై భీమ్ కన్వీనర్ కోన ప్రకాష్ , కె.వి.ఎస్ ఛారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్,ysrcp జిల్లా SC విభాగం ఉపాధ్యక్షులు శ్రీ కోన శంకర్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ శిబిరంలో మహిళలకు క్యాన్సర్ అవగాహన సదస్సుతో పాటు, ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. డాక్టర్ రమేష్ బాబు, డాక్టర్ రమ్య, జంగం జోషి, డాక్టర్ సత్యలు వైద్య సేవలు అందించగా..స్పెషల్ బ్రాంచ్ సి.ఐ. లూధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సేవా కార్యక్రమాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు దశమంతుల మాణిక్యాలరావు, దశమంతుల చిన్ని, సురిని రాము, లీలా కృష్ణ, పిల్ల బాలకృష్ణ, త్రినాథ్, రమేష్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.అనంతరం వారు మాట్లాడుతూ కోన ప్రకాష్, కోనా శంకర్ చేస్తున్న సేవలను కొనియాడారు. కోన శంకర్, కోన ప్రకాష్ మాట్లాడుతూ తన తండ్రి పేరు నిలిచేలా సమాజానికి సేవలందించడం అదృష్టం గా భావిస్తున్నట్టు వెల్లడించారు.

Use Social Media to Spread the Word about Our News

related articles