సేవా పథంలో దువ్వారపు రామారావు జన్మదిన వేడుకలు*#vvwnews

by vvwnews.com

*సేవా పథంలో దువ్వారపు రామారావు జన్మదిన వేడుకలు*

*ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, గణబాబు*

విశాఖపట్నం, జనవరి 25:
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు జన్మదిన వేడుకలు ఆదివారం నగరంలో అత్యంత వైభవంగా జరిగాయి. కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, సేవా కార్యక్రమాలతో ఈ పుట్టినరోజును నిర్వహించడం విశేషం. మాధవధారలోని ఆయన నివాస ప్రాంగణంలో టీడీపీ శ్రేణులు, రాష్ట్ర బీసీ సమాఖ్య సంక్షేమ సంఘం ప్రతినిధులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించింది.
బీసీ సంఘాల ప్రతినిధులు,అభిమానులు, కూటమి నాయకులు,కార్యకర్తల జయజయధ్వానాల మధ్య దువ్వారపు రామారావు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజిపీ ఫ్లోర్ లీడర్, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, Govt Whip,పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు గారు, రాష్ట్ర అయిల్ సీడ్స్ కార్పొరేసాషన్ చైర్మన్ గండి బాబ్జి గారు, భీమిలి ని,, వర్గం ఇంచార్జి, తె దే పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోరాడ రాజబాబు, రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ డైరెక్షర్ అనసూరి మధుసూదన రావు, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ఈటలపాక సుజాత, రాష్ట్ర వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర గవర కార్పొరేషన్ డైరెక్టర్ మల్ల రవి కుమార్, రాష్ట్ర వాడబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ అంగ కృష్ణ, రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ గుర్రపుసాల రామకృష్ణ, రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ రాచకొండ నాగేశ్వరావు, రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ ధర్మారావు, రాష్ట్ర రజక కార్పరేషన్ డైరెక్టర్ మెంటరావు, రాష్ట్ర రజక కార్పొరేషన్ సతీష్, రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ పల్లపు రావు, విశాఖ జిల్లా బీసీ కులాల సమైక్య సంక్షేమ సంఘం నాయకులు తమ్ముడి రాంకుమార్ గారు మోహన్ రావు గారు మల్లాడిరాంబాబు గారు వెంపాట నూకరాజు గారు చిత్ర డప్పారావు గారు గండి మోహన, నరవ పైడ్రాజు వడ్డెర మీరా గారు వడ్డెర చిన్న గారు మేదర సంఘం నాయకులు మరియు బీసీ సంఘాల నాయకులు కార్యకర్తలు మహిళలు భారీ ఎత్తున పాల్గొనిపాల్గొని అయన కు దుశ్శాలువలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దువ్వారపు రామారావు రాజకీయ ప్రస్థానాన్ని, ప్రజా సేవలో ఆయన పోషిస్తున్న క్రియాశీలక పాత్రను కొనియాడారు.అనంతరం దువ్వారపు రామారావు మాట్లాడుతూ.. తన పుట్టినరోజు వేడుకలను ఇంత ఘనంగా నిర్వహించిన బీసీ సంఘాల సమాఖ్య నాయకులకు, కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,మంత్రి నారా లోకేష్ సారథ్యంలో బడుగు, బలహీన వర్గాలకు సేవ చేసే అవకాశం దొరకడం నా పూర్వజన్మ సుకృతం గా భావిస్తానన్నారు.గత వైసీపీ ప్రభుత్వ పాలనలో అస్తవ్యస్తమైన రాష్ట్రాన్ని గడచిన 18 నెలల్లో మళ్ళీ గాడిన పెట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని కొనియాడారు. అటువంటి ప్రజా నాయకుడు అడుగుజాడల్లో నిరంతరం ప్రజా సేవ చేస్తానన్నారు. రానున్న మూడేళ్లలో రాష్ట్రం ‘స్వర్ణాంధ్రప్రదేశ్’గా అవతరిస్తుంది.” అని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, బీసీ సమైక్య సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొని రామారావును గజమాలతో ఘనంగా సత్కరించారు.జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన భారీ రక్తదాన శిబిరం ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ శిబిరాన్ని దువ్వారపు రామారావు స్వయంగా ప్రారంభించారు. ముఖ్యంగా బీసీ సంఘాల మహిళా ప్రతినిధులు, టీడీపీ మహిళా నేతలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి రక్తదానం చేయడం విశేషం. ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేయాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ సేవా కార్యక్రమాన్ని పలువురు అభినందించారు.

Use Social Media to Spread the Word about Our News

related articles