హరిత సైనికులు మన పచ్చని భవిష్యత్తు కోసం- 50 వేల నారు మొక్కలు పంపిణీ #vvwnews

by vvwnews.com

హరిత సైనికులు మన పచ్చని భవిష్యత్తు కోసం
– 50 వేల నారు మొక్కలు పంపిణీ
– పుడమి పచ్చదనంతో కళకళలాడాలి
– శ్రీనివాస రాజమణి, ప్రోగ్రామ్ ఆఫీసర్, ఎస్ ఆర్ యు, జివిఎంసి
“హరిత సైనికులు” మన పచ్చని భవిష్యత్తు కోసం అనే ఆలోచన తో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ ఏర్పాటు చేసిందని ఎస్ ఆర్ యు, జివిఎంసి ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీనివాస రాజమణి అన్నారు. ఈ మేరకు ముక్కనుమ సందర్భంగా విశాఖపట్నం లో రైల్వే స్టేషన్ కు దగ్గరలో ఉన్న 150 సంవత్సరాల మర్రి చెట్టు వద్ద శనివారం ఉదయం గ్రీన్ సోల్జర్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి 50 వేల నారు మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పుడమి పచ్చదనంతో కళకళలాడాలని అందుకు హరిత సైనికులు కృషి అవసరం అన్నారు. ప్రజలు అందరూ ఆరోగ్యంగా, హాయిగా, ఆదాయవంతంగా జీవించటానికి హరిత కృషి చేయాలి అనే ఆలోచన తో ఏర్పాటు చెసారన్నారు. ఇందులో చేరే యువత తమ స్వశక్తితో ఎదిగేలా శిక్షణ ఇవ్వడానికీ, శిక్షణ పొందిన తర్వాత స్వంతంగా జీవించడానికి ఉపాధి కల్పన. వీరి ద్వారా నిరుపేదలను, దారీ తెన్నూ లేని వారికి గుర్తించి చేయూత ఇవ్వడం కూడా చేపడతారన్నారు. అలాగే సమస్త జీవరాశినీ కాపాడటానికి, హాయిగా జీవించటానికి, ఎవరికి వారు తమ ఇంటి వద్ద ఆకుకూరలు, కూరగాయలు పండించుకునెందుకు హరిత సైనికులు కృషి చేసే విధంగా గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ శిక్షణ ఇస్తుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం మాట్లాడుతూ గ్రీన్ సోల్జర్స్ కోసం పలువురు మిత్రులు, సంస్థలు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వ శాఖలతో కలిసి గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ కృషి చేస్తుంది అన్నారు.ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించడానికి హరిత సైనికుల కృషి అవసరం అని పేర్కొన్నారు.
భవిష్యత్తు తరాలు హాయిగా జీవించడానికి హరిత సైనికుల కృషి అవసరమని ,అందుకే గ్రీన్ సోల్జర్స్ యువతకు రోల్ మోడల్స్ గా తయారు చేయాలి అన్నది గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ ఆలోచన అని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు శివలక్ష్మి, యాక్షన్ ఎయిడ్ కర్ణాటక ప్రోజెక్ట్స్ సంస్థ అనకాపల్లి హెచ్ ఆర్ డి ఐ కృష్ణ కుమారి, గ్రీన్ వాలంటీర్ జె రాజేశ్వరి, భూపేష్ నగర్, కొబ్బరి తోట ప్రాంతానికి చెందిన యువతులు, విద్యార్థులు, ఇంటి వద్ద ఆకుకూరలు కూరగాయలు పండించుకునె వారు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles