పితాశ్రీ ప్రజాపిత బ్రహ్మ బాబా 57వ పుణ్య స్మృతి దినము
బ్రహ్మసత్యం జగత్ మిద్యా అనే నానుడి ప్రకారం మనం కాలచరిత్రను పరిశీలించి పరిశోధించి నట్లయితే సృష్టికర్త బ్రహ్మా అని పిలవబడేవారు ఎవరు? ఏ కాలం నాటి వారు? వారి కర్తవ్యం గుణగణాదు లను స్పష్టంగా తెలుసుకోవచ్చు. ప్రజాపిత బ్రహ్మ పురాణ ప్రసిద్ధి, చరిత్ర ప్రసిద్ధి.లోక ప్రసిద్ధిగాంచిన ఏకైక మొదటి మానవుడు. కలియుగ పతిత సృష్టి అంతము ఆధ్యాత్మిక క్రాంతితో ఒక వినూత్న విప్లవ రూపంలో ప్రారంభమైంది ప్రజాపిత బ్రహ్మ బాబా తోనే. మొదట సృష్టి అనేది బ్రహ్మతోనే ప్రారంభమైందని బ్రహ్మే ప్రారంభించాడని అంటారు. బ్రహ్మకి కూడా పునర్జన్మలు ఉన్నాయని జనన మరణ చక్రంలో తిరుగుతారని అంటారు. సృష్టికి మొదటి మానవుడైన అదిదేవ్ బ్రహ్మ దేవుణ్ణి గడ్డాలు మీసాలతో శ్వేతవస్త్రధారిగ అతి సాధారణ రూపంలో చూడడానికి గల కారణం ఇదే.. లేఖ రాజ్ అనే శారీరక నామధేయం కలిగిన బ్రహ్మ బాబా సింధు హైదరాబాద్ ప్రాంతంలో వైష్ణవ సంప్రదాయంలో కృపలాని కుటుంబంలో 1876 లో జన్మించారు. బాల్యం నుండి సద్గుణ రాసి అయ్యి వ్యాపార దక్షత కలుపుగోలుతనం నిరంతర పరిశ్రమ చేసే స్వభావం వలన లేఖ రాజ్ భారతదేశంలోనే 1930 నాటికి సుప్రసిద్ధ వజ్రాల నగల వ్యాపారిగా అయ్యారు. కలకత్తా బొంబాయి వారణాసి తదితర ప్రాంతాలలో తమ వ్యాపారాన్ని విస్తరించారు. దాదా లేఖ రాజు గారు ధార్మిక వ్యక్తిత్వం కలిగి ధార్మిక సిద్ధాంతాలను తమ నిత్యజీవితంలో ఖచ్చితంగా ఆచరించేవారు. సకల తీర్థ స్థానాలను దర్శించి 12 మంది గురువులతో ప్రతిరోజు సత్సంగం చేయుచుండేవారు. వారి 60 సంవత్సరాల నాటికి వారి అంతర్గతంగా అనేక ప్రకారాల ఆధ్యాత్మిక పరివర్తన కలిగి జనన మరణ రహితుడైన నిరాకారుడైన శివ భగవానునికి భగవంతుడైన పరమాత్మ శివునికి ఆధార రథమైనారు. ఓంకార ఉచ్చారణతో వృద్ధులను కన్యలను కుమారులను ఆకర్షించుకొని ఓం మండలి యొక్క స్థాపనకు నాంది పలికారు. ఆనాటి సామాజిక వ్యతిరేకతలను ఎన్నో ఎదుర్కొని పాకిస్తాన్లోని కరాచీ నుండి తిరిగి భారతదేశానికి 1950 సంవత్సరంలో రాజస్థాన్ ఆరావళి పర్వతాల పైన ఈశ్వరీయ విశ్వవిద్యాలయం పేరుతో విశ్వశాంతిని స్థాపించే బృహత్కార్యం లో ఈ మహా యజ్ఞాన్ని ప్రారంభించారు. ప్రజాపిత బ్రహ్మ ముఖ కమలం ద్వారా ఎవరైతే పరమాత్ముని సృష్టి అది మధ్యాంత జ్ఞానాన్ని తెలుసుకున్నారో వారే ప్రజాపిత బ్రహ్మకుమారీ, బ్రహ్మా కుమారులు. ఈ సత్సంగం యొక్క ప్రధాన లక్ష్యం మనసా వాచా కర్మణా సంపూర్ణ పవిత్ర జీవితాన్ని జీవించాలి కలియుగీ మనోవికారాలపైన విజయం పొందడమే జీవన్ముక్తికి ఏకైక సోపానము. సహజ రాజయోగ విద్య ద్వారా మానవులు లక్ష్మీనారాయణలు, సీతారాముల లాంటి దేవి దేవతలుగా అవ్వడమే ఈ ఈశ్వరీ య విశ్వవిద్యాలయం యొక్క ముఖ్య లక్ష్యం. 1969 జనవరి 18 వ తారీఖున బ్రహ్మా బాబా తమ సంపూర్ణ స్థితికి చేరుకుని అవ్యక్తమైనారు. పితాశ్రీ బ్రహ్మ బాబా అడుగుజాడల్లో నడుస్తూ బ్రహ్మకుమారీ కుమారులందరూ తమ పవిత్ర జీవితాలను పరమేశ్వరునికి సర్వస్వం సమర్పించి మానవాత్ముల సేవలను చేయుచు సంస్కార పరివర్తన చేస్తూ సత్యనీతివర్తనులై పరోపకారులై విశ్వ కళ్యాణ కార్యంలో తత్పరులైనారు. పితాశ్రీ బ్రహ్మ బాబా యొక్క మూడు ప్రకారాల చరిత్రను తెలుసుకున్న వారే పవిత్రమైన బ్రహ్మవిద్యను అభ్యసించగలుగుతారు. కలియుగ మానవులు పవిత్ర దివ్య గుణాలుండే దేవాత్మలుగా పరివర్తన అయ్యే లక్ష్యసాధనలో లక్షలాదిమంది ఈ సన్మార్గమును అనుసరిస్తున్నారు. జీవితాన్ని పరివర్తన చేసే ప్రజాపిత బ్రహ్మ బాబా అద్భుత జీవిత చరిత్రను ప్రతి ఒక్కరు చదిని తెలుసుకొని భగవంతుడైన పరమాత్మ తండ్రిని గుర్తించి దుర్గుణాలను దురవ్యసనాలను వదిలి సత్ప్రవర్తనలై సన్మార్గంలో నడుస్తూ ఒక నూతన ప్రపంచ నిర్మాణం “చేయగలుగుతారు ఎవ్వరికీ మనసా వాచా కర్మణా దుఃఖం ఇవ్వకూడదు దుఃఖము తీసుకోకూడదు సర్వలకు స్నేహము ఆత్మీక ప్రేమతో స్వయం పరివర్తన అవుతూ సర్వలను పరివర్తన చేయండి” అని బ్రహ్మ బాబా ప్రపంచంలోసర్వ మతాల ఆత్మల అందరికీ తమ అంతిమ సందేశముగా పలికారు. స్వర్ణమ సత్యయుగ ప్రపంచ నవనిర్మాత, భాగ్య విధాత, సార్వజన అలౌకిక తండ్రి ప్రజాపిత బ్రహ్మ బాబాకు మా
స్నేహపూర్వకమైన ప్రేమతో శ్రద్ధాంజలి అసతోమా సత్ గమయా తమసోమా జ్యోతిర్గమయ మృత్యోమా అమృతంగమయ ఓం శాంతి శాంతి
000000000000