సాంప్రదాయ బద్దంగా భోగి మంటల వేయాలి
– టైర్లు, ప్లాస్టిక్ వ్యర్ధాలు కాల్చి రాదు.
– శంఖబ్రత బాగ్చీ, పోలిస్ కమిషనర్, విశాఖపట్నం
సాంప్రదాయ బద్దంగా భోగి మంటల వేయాలని విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం బీచ్ రోడ్ లో వైఎంసిఎ ఎదురుగా పార్కింగ్ ప్లేస్ లో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సంప్రదాయ భోగి పండుగ కు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి లక్షా ఒక్క దేశీయ ఆవు పేడ పిడకలతో బోగీ మంటకు సాంప్రదాయ బద్దంగా హారతి కర్పూరం వెలిగించి మంట వేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గడిచిన తన 30 ఏళ్ల సర్వీస్ లో మొదటిసారిగా సాంప్రదాయ బద్దంగా, పర్యావరణ హితంగా దేశీయ ఆవు పేడ పిడకలతో భోగి మంట వేయడం ఆనందంగా ఉంది అన్నారు. పండగ పేరుతో టైర్లు, ప్లాస్టిక్ వ్యర్థాలు కాల్చి పర్యావరణానికి హాని కలిగించ వద్దని సూచించారు. మహా నగరంలో వేలాది ప్రదేశాల్లో టైర్లు, ప్లాస్టిక్ వ్యర్ధాలతో భోగి మంటలు వేస్తే వెలువడే వాయు కాలుష్యం ఇటు మనుషులకు అటు జీవరాశి కీ పెను నష్టం కలిగిస్తుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ మాట్లాడుతూ పండుగ అంటే ఆరోగ్యకరమైన వాతావరణం లో, ఆహ్లాదంగా నిర్వహించుకునేది అన్నారు. అంతే కానీ మన వాతావరణాన్ని అనారోగ్యకరం చేసుకోరాదన్నారు. పర్యావరణ హితంగా బోగి పండగ చేసుకుని ఆరోగ్యంగా జీవిద్దామని సూచించారు.
ఈ కార్యక్రమంలో సంకల్ప ఆర్ట్ విలేజ్ నిర్వాహకులు ఆకుల చలపతి రావు, మేంగో మేన్ అప్పాజీ, పాలెం నేచురల్స్ అశోక్, ప్రకృతి పంటలు రైతు శంకర్, గ్రీన్ కైమేట్ టీం ఎన్టీవో వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో చిన్న పిల్లలకు పోలీసు కమిషనర్ బోగి పళ్ళు వేసారు. హరిదాసులు, గంగిరెద్దులు, బుడబుక్కల వాళ్లు, కొమ్మ దాసరి వాళ్ళు, కోలాటం, పులి వేషాలు, దేశీయ నృత్యాలతో పండగ నిర్వహించారు.
సాంప్రదాయ బద్దంగా భోగి మంటల టైర్లు, ప్లాస్టిక్ వ్యర్ధాలు కాల్చి రాదు.శంఖబ్రత బాగ్చీ పోలిస్ కమిషనర్
5