శ్రీ లక్ష్మీ గణపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొన్నేళ్లుగా సంక్రాంతి సందర్భంగా ముగ్గులు పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఈ ఏడాది కూడా కోన బ్రదర్స్ ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాం. మన సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరానికి తెలియజెప్పే క్రమంలో ఈ ముగ్గుల పోటీలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. సంక్రాంతి అంటేనే ఇంటి ముంగిట అందాల ముగ్గులతో సందడిగా ఉంటుంది. ముగ్గుల పోటీల్లో పాల్గొనేందుకు మహిళల నుండి మంచి స్పందన వచ్చింది . విజేతలకు ప్రథమ ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు నాలుగు,ఐదవ స్థానాల్లో నిలిచిన వారికి కూడా బహుమతులను అందజేస్తున్నాం. టాప్ ఫైవ్ విన్నర్స్ తో పాటు ముగ్గులు పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపేషన్ గిఫ్టు ఇస్తున్నాం. ప్రతి ఏటా తాము నిర్వహించే ఈ ముగ్గుల పోటీలకు మంచి స్పందన వస్తోంది.మహిళలు పోటీపడి అందమైన రంగవల్లులను తీర్చిదిద్దారు . ఈ ఏడాది మరింత ఉత్సాహంగా మహిళలు పాల్గొన్నారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నాం.
శ్రీ లక్ష్మీ గణపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొన్నేళ్లుగా సంక్రాంతి సందర్భంగా ముగ్గులు పోటీలు
6