రిలియన్స్ సెంట్రో లో పోటాపోటీగా రంగోలి పోటీలు* #vvwnews #visakhanews #Centro

by vvwnews.com

*రిలియన్స్ సెంట్రో లో పోటాపోటీగా రంగోలి పోటీలు*

– ఆదివారం కూడా మహిళలకు రంగోలి పోటీలు
– పండుగ సందర్భంగా వస్త్రాలపై భారీ ఆఫర్లు

రిలియన్స్ సెంట్రో లో
సంక్రాంతి పండుగ పురస్కారించుకుని మహిళలకు ఏర్పాటు చేసిన రంగోలి పోటీలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. జగదాంబ పరిధి సూపర్ బజార్ ప్రాంగణంలో ఉన్న రిలయన్స్ సెంట్రో మాల్ ప్రాంగణంలో శనివారం సాయంత్రం మహిళలకు రంగోలి పోటీలు నిర్వహించారు. ఈ రంగోలి పోటీల్లో మహిళలు అత్యద్భుతంగా తమ నైపుణ్యాం ప్రదర్శించారు. పోటాపోటీగా వివిధ రకాల రంగవల్లులు వేసి అందర్నీ అబ్బుర పరిచారు. ఈ సందర్భంగా సంస్థ ఎస్జిఎం వెంకటనారాయణ మాట్లాడుతూ రిలియన్స్ సెంట్రో ఎల్లప్పుడూ తమ కస్టమర్లకు ప్రోత్సాహం అందిస్తుంది అన్నారు. బోగి, సంక్రాంతి సందర్భంగా రిలియన్స్ సెంట్రో లో వస్త్రాలు పై భారీ ఆఫర్లు ఏర్పాటు చేశామన్నారు. కుటుంబ సమేతంగా సెంట్రో లో షాపింగ్ చేసుకోవచ్చు అన్నారు. అలాగే సంక్రాంతి పండుగ పురస్కారించుకుని మహిళల కు ఎంతో ఇష్టమైన
రంగోలి పోటీలు శనివారం , ఆదివారం ఏర్పాటు చేశామన్నారు. మహిళలు నుండి విశేష స్పందన వచ్చింది అన్నారు. ఆదివారం కూడా ఔత్సాహికులు ఈ పోటీల్లో పాల్గొన వచ్చన్నారు. పోటీలు అనంతరం విజేతలకు బహుమతులు ప్రకటించారు. ఈ పోటీల్లో ప్రథమ బహుమతి ప్రవీణ గెలుపొందగా, రేవతి రెండవ బహుమతి దక్కించుకున్నారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో రిలియన్స్ సెంట్రో అడ్మిన్ మేనేజర్ నర్సింగ్, డిపార్ట్మెంట్ మేనేజర్ సంతోష్, ఇతర సిబ్బంది లావణ్య, సాగర్, శివ తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles