*పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ జోనల్ అధికారులు ,వార్డు కార్పొరేటర్ల మరియు వార్డ్ అధ్యక్షులతో సమీక్ష కార్యక్రమం నిర్వహించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు*
ఈరోజు అనగా *10.01.2026* తేదీన పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో పెందుర్తి నియోజకవర్గంలోని జీవీఎంసీ జోనల్ అధికారులు,వార్డు కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు.
ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జీవీఎంసీ వార్డుల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టమని, గత ప్రభుత్వములో పూర్తిగా అభివృద్ధిని పక్కనపెట్టి వైసిపి కార్పొరేటర్లు ఉన్న కొన్ని చోట్ల నామమాత్రంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారని అన్నారు. వివిధ నియోజకవర్గాల్లోని శాసనసభ్యులతో జీవీఎంసీ కమిషనర్ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా పెందుర్తి నియోజకవర్గానికి గాను ఈనెల 20వ తారీకున కమీషనర్ తో సమీక్ష సమావేశం ఉన్నందున, వార్డు కార్పొరేటర్లు, అధ్యక్షులు తమ తమ వార్డుల్లో ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది, ముందుగా యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన పనులు, వాటి ఎస్టిమేషన్లను ఈనెల 20వ తారీకు లోపు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలన్నారు. ఉమ్మడి కూటమి ప్రభుత్వం మూడు పార్టీల కలయిక అయినప్పటికీ, అభివృద్ధిలో మాత్రం అందరిదీ ఒకటే మాట అన్నారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావు లేదని, ఈ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని అన్నారు. దీనికి అందరి సహాయ సహకారాలు అవసరమని ఆయన కోరారు
ఈ యొక్క కార్యక్రమంలో పెందుర్తి జోనల్ కమిషనర్ శంకర్రావు గారు, అగనంపూడి జోనల్ కమిషనర్ శ్రీమతి శ్రీ మనీషా త్రిపాఠి గారు,77 వార్డు కార్పొరేటర్లు బుట్టా సూర్య కుమారి గారు, 85 వార్డు కార్పొరేటర్ ఇల్లపు వరలక్ష్మి ప్రసాద్ గారు,97 వార్డ్ కార్పొరేటర్ సేనాపతి వసంతా శంకరరావు గారు , 79 వార్డు కార్పొరేటర్ రౌతు శ్రీనివాసరావు గారు,93 వార్డు కార్పొరేటర్ రాపర్తి కన్నా గారు, 94 వార్డు కార్పొరేటర్ బల్లా శ్రీనివాసరావు గారు, పెందుర్తి పిఎసిఎస్ చైర్మన్ అయిత సింహాచలం గారు,సీనియర్ నాయకులు ఇందల రమణగారు, దుళ్ల రాము నాయుడు గారు, సేనాపతి శంకర్రావు గారు, దాట్ల మధుగారు,గల్లా శ్రీనివాస రావు గారు , ఇల్లపు ప్రసాద్ గారు,వార్డు అధ్యక్షులు కాకి బాబు గారు, గవర సోమశేఖర్ గారు, పిల్లా శివకృష్ణ గారు, ఒబ్బిన జనార్దన్ శ్రీకాంత్ గారు,పిన్నింటి పార్వతి గారు, సేనాపతి సోమశేఖర్ గారు, కంచిపాటి మధుగారు,డి బి ఎల్ సంతోష్ గారు, మజ్జి సూరిబాబు గారు, కోరుకొండ వరహాలు గారు, మరియు జీవీఎంసీ ఉన్నత అధికారులు ఈ యొక్క సమీక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు