పర్యావరణహితంగా జీవించుదాం
– ప్రతి విద్యార్థి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి
– తిరుమల శ్రీదేవి, ప్రధాన ఉపాధ్యాయురాలు, పండిట్ నెహ్రూ ఉన్నత పాఠశాల
పర్యావరణహితంగా జీవించుదాం అని భీమునిపట్నం
పండిట్ నెహ్రూ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు తిరుమల శ్రీదేవి కోరారు. శుక్రవారం ఉదయం గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ నేతృత్వంలో పర్యావరణ హిత జీవన విధానం మీద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి అని కోరారు. పర్యావరణ హితంగా జీవించడానికి అనువైన విధానం గురించి వివరించారు. కాలుష్యం పెరుగుతున్న సమయం లో ప్రతి ఒక్కరూ కాలుష్య నియంత్రణ కోసం కృషి చేయాలి అన్నారు. ప్రకృతి ఆధారంగా పంటలు పండించాలి, ఆ పంటలనే ఆహారంగా తీసుకోవడం మంచిది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పది మొక్కలు నాటి పెంచాలి అని కోరారు. ఎవరికి వారు తమ ఇంటి వద్ద ఆకుకూరలు, కూరగాయలు పండించు కోవాలి అని కోరారు. విద్యార్థులు తమ ఇంటి వద్ద ఆకుకూరలు కూరగాయలు పండించుకునె మెళుకువలు వివరించారు.
ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు మాట్లాడారు .
పర్యావరణహితంగా జీవించుదాం- ప్రతి విద్యార్థి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి#vvwnews
7