ప్రపంచంలోనే వరాహ నారసింహ అవతారాల తో కూడిన సింహాద్రినాథుడు అత్యంత మహిమాన్వితుడని ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ అన్నారు.. సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు.. ప్రత్యేక ఆహ్వానితులు.. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి
డాక్ యార్డ్ కేటీబి అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు
ప్రతి ఏటా మాదిరిగానే రూపకల్పన చేసిన వార్షిక 2026 క్యాలెండర్ ను నూతన సంవత్సరం పురస్కరించుకొని గురువారం మాధవ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. మద్దిలపాలెంలోని ఆయన నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాధవ్ మాట్లాడుతూ ఏడాది పొడవునా దేవస్థానంలో జరిగే ఉత్సవాలు వాటి అలంకరణలు క్యాలెండర్ లో పొందుపరచడం అభినందనీయమన్నారు.. ఇటువంటి క్యాలెండర్ ల వల్ల
ప్రజల్లో మరింత ఆధ్యాత్మిక భక్తి భావం పెరుగుతుందన్నారు.. అలాగే ప్రతి ఒక్కరూ నిత్యం స్వామిని ఈ ఫోటోలు ద్వారా ఆరాధించుకోవడానికి అవకాశం కలుగుతుందన్నారు.. ఉత్తరాంధ్ర ప్రజలకు సింహాద్రినాథుడు ఇలవేల్పు అని ..కూటమి ప్రభుత్వ హయాంలో సింహాచలం మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఇప్పటికే భక్తుల కోసం దేవస్థానం అన్ని విధాల ఏర్పాట్లు చేస్తుందన్నారు…. ఈ సందర్భంగా
గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ సింహాచలంలో జన్మించిన తనకు స్వామిని నిత్యం సేవించుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు చెప్పారు.. అలాగే ప్రతి ఏటా అప్పన్న అలంకరణలతో కూడిన క్యాలెండర్ రూపకల్పన చేసి ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు… అనంతరంమాధవ్ ను గంట్ల శ్రీనుబాబు
ఘనంగా సత్కరించారు అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు..
ప్రపంచంలోనే వరాహ నారసింహ అవతారాల తో కూడిన సింహాద్రినాథుడు అత్యంత ! #vvwnews
7
previous post