7
*కార్పొరేటర్ హేమలతకు ఘనంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు*
మధురవాడ జీవీఎంసీ 5వ వార్డు కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ సభ్యురాలు మొల్లి హేమలతకు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.గురువారం మధురవాడ, బొట్టవానిపాలెం లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మధురవాడ ప్రాంత ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమెను కలిసి పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా హేమలత మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో వార్డు అభివృద్ధికి మరింత కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు మొల్లి లక్ష్మణరావు, పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.