పాయకరావుపేట నియోజకవర్గం అభివృద్ధి కోసం హోం మంత్రి అనిత నిరంతరం కష్టపడుతున్నారు.

by vvwnews.com

పాయకరావుపేట

అడ్డురోడ్డు కేంద్రంగా రెవిన్యూ డివిజన్ ఏర్పాటు నేపథ్యంలో నక్కపల్లి హోం మంత్రి అనిత నివాసం వద్ద ఎన్డీఏ కూటమి నాయకులు సంబరాలు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, హోం మంత్రి అనిత చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన నేతలు.

ఒకరికొకరు స్వీట్లు తినిపించుకొని, అనితమ్మ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, హోం మంత్రి అనితకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన పేట నియోజకవర్గ నాయకులు.

*పాయకరావుపేట నియోజకవర్గ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ కామెంట్స్*

అడ్డురోడ్డు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషం.

అధికారులు కూడా ఇప్పటికే స్థలాన్ని పరిశీలించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, హోం మంత్రి అనితకు ప్రత్యేక ధన్యవాదాలు.

పాయకరావుపేట నియోజకవర్గం అభివృద్ధి కోసం హోం మంత్రి అనిత నిరంతరం కష్టపడుతున్నారు.

2014 నుండి 2019 వరకు మంత్రి అనిత సారథ్యంలో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.

తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం 2019 నుండి 2024 వరకు అనేక పోరాటాలు చేశారు.

పాయకరావుపేట నియోజకవర్గానికి మంత్రి పదవి తీసుకురావడమే కాకుండా, కూటమి ప్రభుత్వానికి ప్రతిష్టను పెంపొందించడానికి ప్రయత్నం చేస్తున్నారు.

పేట నియోజకవర్గంలో స్టీల్ ప్లాంట్ బొమ్మల పరిశ్రమతో పాటు అనేక పరిశ్రమలు తీసుకురావడంలో మంత్రి అనిత కీలకపాత్ర పోషిస్తున్నారు.

ఈ ప్రాంతంలో లక్షలాదిమందికు ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.

వ్యాపార రంగం కూడా ఈ ప్రాంతంలో పెరగనుంది.

కొత్తగా వచ్చిన ఎలమంచిలి కొత్త పెళ్ళికొడుకు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు.

అసలు అడ్డరోడ్డు సంగతి నీకేం తెలుసు ధర్మ శ్రీ?

అడ్డురోడ్డు వ్యాపార రంగానికి కూడలి.

ఎలమంచిలిలో రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తాం అనుకున్నప్పుడు గత ఐదు సంవత్సరాలు మీ ప్రభుత్వం ఏం చేసింది?

నేరం, ఘోరం, భారం అంటున్నారు. అసలు ప్రభుత్వానికి మీరే భారం.

మూడు సంవత్సరాల తర్వాత రెవెన్యూ డివిజన్ ఎలమంచిలి తెచ్చుకుంటాం అంటే,మీ ప్రభుత్వం వచ్చేది లేదు చచ్చేది లేదు.

మరో 30 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం ఖాయం.

మాటలు మాట్లాడే ముందు ఆలోచించాలి.

పాయకరావుపేట నియోజకవర్గం కోసం కానీ, అనితమ్మ కోసం కానీ తప్పుడు మాటలు మాట్లాడితే నాలిక కోస్తాం.

ఎలమంచిలి పాయకరావుపేట పక్కపక్క నియోజకవర్గాలు.

మేమంతా అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉంటాం

*అమలంకంటి అబద్ధం, ఎస్ రాయవరం మండలం టిడిపి అధ్యక్షులు*

అడ్డురోడ్డు కేంద్రంగా రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది.

ఎన్నికలలో ఇవ్వని హామీలను కూడా మంత్రి అనిత నెరవేరుస్తున్నారు.

అనేక పరిశ్రమలు తీసుకురావడమే కాకుండా, నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా మంత్రి అనిత అభివృద్ధి చేస్తున్నారు.

అ అంటే అనితమ్మ, అ అంటే అభివృద్ధి అన్నారు.

వైసిపి నేత ధర్మశ్రీ కు ఎలమంచిలి ఇప్పుడు గుర్తు వచ్చిందా?

అసలు ధర్మ శ్రీ ఇప్పటివరకు ఎలమంచిలిలో ఎందుకు పోటీ చేయలేదు.

మంత్రి అనిత పాయకరావుపేట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించటం వలనే రెవిన్యూ డివిజన్ వచ్చింది.

ఎస్ రాయవరం మండల ప్రజల తరపున మంత్రి అనిత గారికి ప్రత్యేక ధన్యవాదాలు.

Use Social Media to Spread the Word about Our News

related articles